News July 11, 2024
పీరియడ్స్ ఎప్పుడొస్తుందో చెప్పే స్మార్ట్ రింగ్!

టెక్ దిగ్గజం శామ్‌సంగ్ స్మార్ట్ రింగ్‌ను విడుదల చేసింది. Samsung Galaxy Ring పేరుతో రిలీజైన ఇది మానవ జీవన శైలిని క్యాప్చర్ చేస్తుంది. Samsung Health యాప్‌లోని AI.. వ్యక్తికి సంబంధించిన పీరియడ్స్ టైమింగ్, స్లీప్ ట్రాకింగ్, హృదయ స్పందన రేటు, స్కిన్ టెంపరేచర్ వంటివి తెలియజేస్తుంది. దీని ధర $399 (రూ.33వేలు)గా శామ్‌సంగ్ నిర్ణయించింది. తాజాగా ప్రీఆర్డర్ మొదలవగా ఈనెల చివరి వారంలో డెలివరీ చేయనుంది.
Similar News
News April 9, 2026
పిల్లలను ట్యూషన్‌కు పంపుతున్నారా?

పిల్లలందరికీ ట్యూషన్ అవసరం లేదు కానీ పేరెంట్స్ పర్యవేక్షణ ముఖ్యమని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ‘చదువులో కాన్ఫిడెంట్‌గా ఉంటూ రాణిస్తుంటే ట్యూషన్ పేరుతో మరో భారం వద్దు. అవసరం లేకపోయినా పంపితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. మెంటల్ ప్రెజర్ పెరుగుతుంది. చదువు బోర్ కొడుతుంది. ఆడుకునే సమయం తగ్గిపోవడం వల్ల ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండలేరు. ఇంట్లో సరైన గైడెన్స్ లేకపోతే ట్యూషన్ అవసరం’ అని చెబుతున్నారు.
News April 9, 2026
‘హార్ముజ్’పై ఇరాన్ కీలక ప్రకటన!

హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకల కోసం ఇరాన్ ప్రత్యామ్నాయ మార్గాలను ప్రకటించినట్లు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. గతంలో అమెరికా, ఇజ్రాయెల్, వాటి మిత్ర దేశాల నౌకలను అడ్డుకునేందుకు IRGC ఏర్పాటుచేసిన సీమైన్స్ బారిన షిప్పులు పడకుండా ఈ ప్రకటన చేసినట్లు తెలిపింది. ‘టెహ్రాన్ టోల్ బూత్’ కారిడార్ అని పిలిచే ఖేష్మ్, లారక్ దీవుల సమీపం నుంచి ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు పేర్కొంది.
News April 9, 2026
గొంతులో మాంసం ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి

TG: గొంతులో మాంసం ఇరుక్కొని ఊపిరాడక ఓ వ్యక్తి మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా దామరవంచ శివారు పిల్లిగుండ్లతండాకు చెందిన బానోతు బిచ్చా(54) తన ఇంట్లో దుర్గమ్మ పండగ చేసుకున్నారు. ఈ క్రమంలో రాత్రి భోజనం చేస్తున్న సమయంలో గొంతులో మాంసపు ముక్క ఇరుక్కుంది. ఊపిరాడక విలవిల్లాడిన బిచ్చాను కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.


