News July 11, 2024

MBNR: “TODAY TOP NEWS’!!

image

✏NRPT:ఆవు మృతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న రైతు ✏మహబూబ్‌నగర్: రేపు ఉద్యోగ మేళా! ✏రేపు వనపర్తికి డిప్యూటీ సీఎం, మంత్రులు రాక ✏ఏకరూప దుస్తుల వివరాలు అందజేయండి: DEOలు ✏రేపు కలెక్టరేట్ ముట్టడి:ABVP ✏NRPT: చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి మృతి ✏ఉమ్మడి జిల్లాలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ అవగాహన ర్యాలీలు ✏ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న మొహర్రం సందడి ✏ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్స్

Similar News

News January 28, 2025

కర్ణాటక మంత్రులను కలిసిన జడ్చర్ల ఎమ్మెల్యే

image

యాద్గిర్‌లో కర్ణాటక హోమ్ మినిస్టర్ డా. జి. పరమేశ్వర, పరిశ్రమల మంత్రి శరణబసప్పను జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పలు రాజకీయ అంశాల పై చర్చించారు. అనంతరం భోజనం చేశారు. యాద్గిర్ ఎమ్మెల్యే చెన్నారెడ్డి పాటిల్ తున్నూర్, షోరాపూర్ ఎమ్మెల్యే రాజా వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

News January 27, 2025

అచ్చంపేటలో ఉద్రిక్తత

image

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ అంతటి రజిత భర్త మల్లేష్ పై సోమవారం రైతులు దాడి చేశారు. అంతకంటే ముందు వ్యవసాయ మార్కెట్‌ను ముట్టడించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో అచ్చంపేటలో ఉద్రిక్తత నెలకొంది. తాము పండించిన పంటకు మద్దతు ధర రావడం లేదని వారు నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎస్సై రమేష్ ఘటనా స్థలికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు.

News January 27, 2025

జడ్చర్ల: తాజా మాజీ సర్పంచ్ మృతి

image

జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ సింగం దాస్ నర్సింహులు అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు. మృతునికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండేవాడని గ్రామస్థులు తెలిపారు. నరసింహులు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.