News July 11, 2024
TCS లాభం రూ.12వేల కోట్లు.. కొత్త ఉద్యోగులు 5,452 మంది

FY2024-25 Q1లో 8.7% వృద్ధితో రూ.12,040 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు TCS వెల్లడించింది. మొత్తం ఆదాయం 5.4 శాతం వృద్ధితో రూ.62,613 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. గత 3 నెలల్లో 5,452 మందిని కొత్తగా నియమించుకున్నట్లు వివరించింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి చేరినట్లు తెలిపింది. వీరిని 151 దేశాల నుంచి రిక్రూట్ చేసుకున్నామంది. ఉద్యోగుల్లో 35.5 శాతం మహిళలు ఉన్నారని వెల్లడించింది.
Similar News
News December 28, 2025
DRDO-DGREలో JRF పోస్టులు

<
News December 28, 2025
న్యూ ఇయర్ పార్టీ చేసుకునే వారికి హెచ్చరిక

TG: న్యూ ఇయర్ పార్టీల్లో మద్యం వినియోగానికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ హెచ్చరించారు. జనవరి 1 వరకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(NDPL)తో పాటు డ్రగ్స్ అమ్మకాలు, వినియోగాలపై తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. NDP లిక్కర్‌ను రాష్ట్రంలోకి రాకుండా అన్ని మార్గాల్లో నిఘా పెట్టి నిలువరించాలని అధికారులను ఆదేశించారు.
News December 28, 2025
టీ20ల్లో హయ్యెస్ట్ స్కోర్.. ఉమెన్స్ టీమ్ రికార్డ్

శ్రీలంక ఉమెన్స్ జట్టుతో జరుగుతున్న 4వ టీ20లో టీమ్ ఇండియా 221 రన్స్ చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. అంతర్జాతీయ T20 మ్యాచుల్లో మనకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. భారత్ 2024లో వెస్టిండీస్‌పై 217/4, ఈ ఏడాది నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌పై 210/5 రన్స్ చేసింది. అటు ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన-షెఫాలీ వర్మ కలిసి హయ్యెస్ట్ ఫస్ట్ వికెట్ పార్ట్‌నర్‌షిప్(162 రన్స్) నమోదు చేశారు.


