News July 11, 2024
ఏపీలో 9 మంది ఐపీఎస్‌ల బదిలీ

AP: రాష్ట్రంలో 9 మంది IPSలు బదిలీ అయ్యారు. SPF డీజీగా అంజనా సిన్హా, లా అండ్ ఆర్డర్ DGగా సీహెచ్ శ్రీకాంత్, విజయవాడ CPగా రాజశేఖర్ బాబు, అగ్నిమాపక శాఖ డీజీగా మాదిరెడ్డి ప్రతాప్, లాజిస్టిక్స్ ఐజీగా PHD రామకృష్ణ(పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు), కర్నూలు రేంజ్ DIGగా కోయ ప్రవీణ్, గ్రే హౌండ్స్ IGగా గోపీనాథ్ జెట్టి, DGP ఆఫీసులో రిపోర్ట్ చేయాలని విశాల్ గున్నీ, విజయరావులను GOVT ఆదేశించింది.
Similar News
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్‌ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<