News July 11, 2024

గంభీర్ డిమాండ్‌ను తోసిపుచ్చిన బీసీసీఐ?

image

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ డిమాండ్‌ను బీసీసీఐ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఫీల్డింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్‌ను తీసుకోవాలని గౌతీ కోరారు. కానీ ఈ ప్రతిపాదనకు బోర్డు పెద్దలు నో చెప్పినట్లు సమాచారం. స్వదేశీ స్టాఫ్‌ను నియమించుకునే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 19, 2025

యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుదల

image

UGC NET-2024 వాయిదా పడిన పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. <>ugcnetdec2024.ntaonline.in/<<>> సైట్‌లో అప్లికేషన్ నంబర్, DOB, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 15న జరగాల్సిన ఎగ్జామ్‌ను సంక్రాంతి నేపథ్యంలో 21, 27 తేదీలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

News January 19, 2025

VIRAL: కుంభమేళాలో ఈయన స్పెషల్

image

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళాకు వచ్చిన వారిలో రోజుకో బాబా సోషల్ మీడియాలో వైరలవుతున్నారు. తాజాగా ఏడు అడుగులున్న రష్యాకు చెందిన ‘ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్ బాబా’ గురించి చర్చించుకుంటున్నారు. ఈ కండలు తిరిగిన సాధువు తన జీవితాన్ని హిందూమత ప్రచారానికి అంకితం చేశారు. ఆయన 30 ఏళ్ల క్రితం టీచర్ ఉద్యోగాన్ని వదిలి సనాతన ధర్మాన్ని స్వీకరించారు.

News January 19, 2025

ట్రంప్‌తో ముకేశ్- నీతా అంబానీ

image

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రేపు ప్రమాణం చేయనున్నారు. ఈ వేడుకకు వివిధ దేశాల ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే, దీనికి ముందే ట్రంప్ ఏర్పాటు చేసిన ‘క్యాండిల్ లైట్ డిన్నర్’కు భారత కుబేరుడు ముకేశ్ అంబానీ తన భార్య నీతా అంబానీతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో వీరు దిగిన ఫొటో వైరలవుతోంది. కాగా, ప్రమాణస్వీకారోత్సవం తర్వాత మార్క్ జుకర్‌బర్గ్ ఇచ్చే డిన్నర్‌లోనూ వీరు పాల్గొననున్నారు.