News July 12, 2024
శ్రీకాకుళం ఐఐఐటీ ప్రాంగణానికి 1,110 మంది ఎంపిక

శ్రీకాకుళం ఐఐఐటీ ప్రాంగణానికి సంబంధించి 1,110 మంది ఎంపికైనట్లు డైరెక్టర్ ప్రొ. బాలాజీ, పరిపాలనా అదికారి. ముని రామకృష్ణ తెలిపారు. వీరిలో 685 మంది అమ్మాయిలు, 325 మంది అబ్బాయిలు, ప్రత్యేక కేటగిరీ కింద 100 మంది విద్యార్థులు ఎంపికైనట్లు వారు తెలిపారు. విద్యార్థులు కౌన్సలింగ్‌కు హాజరు కావాలన్నారు.
Similar News
News November 9, 2025
మాంగోలియా జైల్లో ఇరుక్కున్న సిక్కోలు వాసి

ఉపాధి నిమిత్తం విదేశానికి వెళ్లిన ఓ శ్రీకాకుళం జిల్లా వ్యక్తి అక్కడి జైల్లో ఇరుక్కున్నాడు. సంతబొమ్మాళి(M) లక్కీవలస పంచాయతీ పిట్టవానిపేటకు చెందిన తూలు గారయ్య 5నెలల అగ్రిమెంట్‌తో పెయింటింగ్ పనులకు వెళ్లాడు. ఈనెల 7న ఇండియాకు వస్తానంటూ అక్కడి ఎయిర్‌పోర్ట్ నుంచి ఫోన్ చేసిన తన భర్త ఇప్పటి వరకు రాలేదని భార్య తూలు ఎర్రమ్మ వాపోయారు. ప్రభుత్వం సాయం చేయాలని ఆమె కోరుతున్నాడు.
News November 9, 2025
శ్రీకాకుళం: రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్

ఏటా కార్తీక మాసం 3వ సోమవారం సెలవు ఇస్తారని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(DTF) శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసన్న, కృష్ణారావు చెప్పారు. కానీ రేపటి నుంచి జిల్లాలో అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు స్థానిక సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారిద్దరూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
News November 8, 2025
మాజీ మంత్రి అప్పలరాజుకు నోటీసులు?

మాజీ మంత్రి అప్పలరాజుకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా గతేడాది ప్రభుత్వంపై ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. వీటిపై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నిమిత్తం విచారణకు రావాలని కోరుతూ సీదిరి ఇంటికి శనివారం వెళ్లి ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారని సమాచారం.


