News July 12, 2024

ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ?

image

‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నిర్మించనున్నట్లు సమాచారం. ఇదే సినిమాలో బాలకృష్ణ కూడా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తండ్రీకొడుకులను ఒకే ఫ్రేమ్‌లో చూపించేందుకు ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. త్వరలోనే ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు టాక్.

Similar News

News January 12, 2026

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,690 పెరిగి రూ.1,42,150కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,550 ఎగబాకి రూ.1,30,300 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.12వేలు పెరిగి రూ.2,87,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి

News January 12, 2026

‘గోల్డెన్ గ్లోబ్’ వేడుకల్లో ప్రియాంక మెరుపులు

image

అంతర్జాతీయ వేదికపై మరోసారి భారతీయ సినీ స్టార్ మెరిశారు. గతంలో ఆస్కార్ వేడుకల్లో దీపికా పదుకొణె ప్రత్యేక ఆకర్షణగా నిలవగా తాజాగా జరుగుతున్న గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్‌కు ప్రియాంకా చోప్రా హాజరయ్యారు. బ్లూడ్రెస్‌లో రెడ్ కార్పెట్‌పై హొయలు పోయారు. తన భర్త నిక్ జోనస్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. కాగా 2023లో RRR ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది.

News January 12, 2026

అక్షర యోధుడు అలిశెట్టి

image

కవిత్వంతో ప్రజల్లో ఆలోచనాదృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన అతికొద్ది మంది కవుల్లో అలిశెట్టి ప్రభాకర్ ఒకరు. చిత్రకారుడిగా, ఫొటో గ్రాఫర్‌గా పని చేస్తూనే కవిగా ఎదిగారు. సామాజిక చైతన్యమే ధ్యేయంగా కవిత్వాలు రాశారు. ‘ఎర్ర పావురాలు’, ‘మరణం నా చివరి చరణం కాదు’, ‘సిటీలైఫ్’ వంటి కవితా సంకలనాలు రచించారు. తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక పేజీ సృష్టించుకున్నారు. నేడు ఆయన జయంతి, వర్ధంతి(1956-1993).