News July 12, 2024
‘మహా’ ఎన్నికల్లో 225 ప్రతిపక్షాలకే వస్తాయి: పవార్
మహారాష్ట్రలో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను ప్రతిపక్షాలకు 225 స్థానాల్లో విజయం దక్కుతుందని ఎన్సీపీ(sp) అధినేత శరద్ పవార్ పార్టీ అంతర్గత సమావేశంలో జోస్యం చెప్పారు. ‘రాష్ట్రం ఇప్పుడు తప్పుడు వ్యక్తుల చేతిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో తేలింది. 2019లో 6 ఎంపీ సీట్లే గెలిచిన ప్రతిపక్షాలు, ఈ ఏడాది 31కి చేరుకున్నాయి’ అని గుర్తుచేశారు.
Similar News
News January 19, 2025
Debate: తమ్ముళ్ల ఆలోచన అదేనా..?
లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే TDP డిమాండ్‌పై నెట్టింట డిబేట్ అవుతోంది. గతంలో కీలక మంత్రిగా, ప్రతిపక్షంలో పాదయాత్రతో జనాల్లోకి వెళ్లిన ఆయన ఈ పదవికి అర్హుడని TDP అంటోంది. కానీ ఇది పవన్‌ను కంట్రోల్ చేసే స్టెప్ అనేది జనసేన వర్షన్. చంద్రబాబు సైతం కంట్రోల్ చేయలేకపోతున్న పవన్‌ను బ్యాలెన్స్ చేయాలంటే లోకేశ్ No.2గా ఉండాలనేది తెలుగు తమ్ముళ్ల ఆలోచన అంటున్నారు. మరి నిజంగానే క్యాడర్ కోరికనా? కట్టడి ప్రయత్నమా?
News January 19, 2025
జుట్టు బాగా రాలుతోందా..? ఇలా చేశారంటే..
– మీ చర్మం, జుట్టుకు ఏ తరహా షాంపూ/ప్రొడక్ట్ సెట్ అవుతుందో డాక్టర్‌తో తెలుసుకుని వాటిని వాడటం బెటర్
– రోజూ తలస్నానం చేస్తే కుదుళ్లు పొడిగా మారి వెంట్రుకలు రాలుతాయి. చెమట, పనిని బట్టి వారానికి 2-3సార్లు తలస్నానం మంచిది.
– జడ/జుట్టు బంధించినట్లు కాకుండా కాస్త వదులుగా ఉంచితే రక్త ప్రసరణ సులువై వెంట్రుకలు బలంగా ఉంటాయి
– ఎక్కువ కాలం హెయిర్ డ్రయర్ వాడవద్దు
– ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా జుట్టు రాలుతుంది
News January 19, 2025
కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్
AP: సంక్రాంతి సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారంతా తిరుగుపయనం అవుతున్నారు. సోమవారం నుంచి స్కూళ్లు, ఆఫీస్‌లు ఉండటంతో ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో విజయవాడ బస్టాండ్ కిటకిటలాడుతోంది. ఇక్కడి నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్లే బస్సులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. పండగ నేపథ్యంలో విజయవాడ నుంచి 133 అదనపు బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.