News July 12, 2024

విరాట్‌కు ఆ విషయాన్ని చెప్పని బీసీసీఐ?

image

టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ కీలక ఆటగాళ్లే. అయితే.. కోచ్‌గా గంభీర్‌ను ఎంపిక చేసిన సంగతిని బీసీసీఐ కోహ్లీకి చెప్పలేదట. టీ20 కెప్టెన్‌ రేసులో ముందున్న హార్దిక్ పాండ్యకు, ఇటు రోహిత్‌కు మాత్రమే బీసీసీఐ విషయాన్ని చెప్పిందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. విరాట్‌, గౌతీల మధ్య ఉన్న గత చరిత్ర, విరాట్ ఆటగాడు మాత్రమే కావడంతో చెప్పనక్కర్లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.

Similar News

News January 19, 2025

ముగిసిన సీఎం రేవంత్ సింగపూర్ పర్యటన

image

TG: CM రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన ముగిసింది. ఆయన నేతృత్వంలోని రాష్ట్ర బృందం బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. రాష్ట్రంలో రూ.3500Crతో ఆర్ట్ డేటా సెంటర్ పెట్టేందుకు STT గ్లోబల్ డేటా సెంటర్, రూ.450Crతో IT పార్క్ నిర్మించేందుకు క్యాపిటల్ ల్యాండ్ అంగీకరించాయి. ఇండియన్ ఓషియన్ గ్రూప్, DBS, బ్లాక్‌స్టోన్, మైన్ హార్డ్ తదితర కంపెనీలతో CM చర్చించారు. రేపటి నుంచి ఆయన దావోస్‌లో పర్యటిస్తారు.

News January 19, 2025

Debate: తమ్ముళ్ల ఆలోచన అదేనా..?

image

లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే TDP డిమాండ్‌పై నెట్టింట డిబేట్ అవుతోంది. గతంలో కీలక మంత్రిగా, ప్రతిపక్షంలో పాదయాత్రతో జనాల్లోకి వెళ్లిన ఆయన ఈ పదవికి అర్హుడని TDP అంటోంది. కానీ ఇది పవన్‌ను కంట్రోల్ చేసే స్టెప్ అనేది జనసేన వర్షన్. చంద్రబాబు సైతం కంట్రోల్ చేయలేకపోతున్న పవన్‌ను బ్యాలెన్స్ చేయాలంటే లోకేశ్ No.2గా ఉండాలనేది తెలుగు తమ్ముళ్ల ఆలోచన అంటున్నారు. మరి నిజంగానే క్యాడర్ కోరికనా? కట్టడి ప్రయత్నమా?

News January 19, 2025

జుట్టు బాగా రాలుతోందా..? ఇలా చేశారంటే..

image

– మీ చర్మం, జుట్టుకు ఏ తరహా షాంపూ/ప్రొడక్ట్ సెట్ అవుతుందో డాక్టర్‌తో తెలుసుకుని వాటిని వాడటం బెటర్
– రోజూ తలస్నానం చేస్తే కుదుళ్లు పొడిగా మారి వెంట్రుకలు రాలుతాయి. చెమట, పనిని బట్టి వారానికి 2-3సార్లు తలస్నానం మంచిది.
– జడ/జుట్టు బంధించినట్లు కాకుండా కాస్త వదులుగా ఉంచితే రక్త ప్రసరణ సులువై వెంట్రుకలు బలంగా ఉంటాయి
– ఎక్కువ కాలం హెయిర్ డ్రయర్ వాడవద్దు
– ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా జుట్టు రాలుతుంది