News July 12, 2024
నేటికీ వారానికి 1700మంది కొవిడ్‌తో మృతి: WHO

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ కొవిడ్ విషయంలో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. నేటికీ వారానికి 1700మంది కొవిడ్‌కు బలవుతున్నారని తెలిపారు. ‘టీకాలు ఆపొద్దు. ప్రధానంగా 60కి పైబడినవారిలో ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. వారు తమ చివరి డోసు వేయించుకున్న 12నెలలలోపు మరో డోసు తీసుకోవాలి. ప్రభుత్వాలు వైరస్‌పై నిఘాను కొనసాగించాలి. ప్రజలందరికీ చికిత్స అందుబాటులోకి తీసుకురావాలి’ అని సూచించారు.
Similar News
News January 3, 2026
రూ.500 నోట్ల నిలిపివేత?.. నిజమిదే!

దేశంలో మార్చి నుంచి రూ.500 నోట్లు రద్దు కానున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఆ నోట్ల చెలామణీ నిలిచిపోతుందన్న వార్తలన్నీ ఫేక్ అని స్పష్టం చేసింది. రూ.500 నోట్ల రద్దుపై ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పుకార్లను నమ్మి గందరగోళానికి గురి కావద్దని సూచించింది. కాగా గత జూన్‌లోనూ ఇలాంటి <<16594040>>ప్రచారమే<<>> జరిగింది.
News January 3, 2026
నవగ్రహాలను దర్శించుకొని కాళ్లు కడగకూడదా?

అలా కడగకూడదని పండితులు చెబుతుంటారు. అలా కడిగితే గ్రహాల శక్తి తరంగాలు మనపై చూపించే సానుకూల ప్రభావం, పుణ్యఫలం తగ్గిపోతుందని అంటారు. అయితే ఆలయం నుంచి ఇంటికి వెళ్లి, కొద్ది సమయం తర్వాత కడుక్కోవచ్చట. నవగ్రహాల ప్రదక్షిణలు ముగించి, కాసేపు అక్కడ కూర్చుని, ఆ గ్రహాల అనుగ్రహాన్ని స్మరించుకుని బయటకు రావాలట. ప్రదక్షిణ చేసిన వెంటనే కాళ్లు కడగడం వల్ల దోష నివారణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని భక్తుల నమ్మకం.
News January 3, 2026
‘ఉగ్రవాదాన్ని ఎగదోస్తా.. నాకు నీళ్లివ్వండి’ అంటే ఎట్లా?: జైశంకర్

పాక్‌తో సింధూ జలాల ఒప్పందం నిలిపేవేతపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ‘‘పాక్ దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. మీరు సరైన నైబర్‌గా లేకపోతే ఓ మంచి పొరుగు దేశం నుంచి ప్రయోజనాలు పొందలేరు. ‘మీపైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తా.. నాకు నీళ్లివ్వండి’ అని అడిగితే ఎట్లా?’’ అని ప్రశ్నించారు. ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కు ఇండియాకు ఉందని, ఆ హక్కును ఎలా ఉపయోగించుకోవాలో ఎవరూ నిర్దేశించలేరని స్పష్టంచేశారు.


