News July 12, 2024

VZM: మరో ఆరునెలల్లో రిటైర్మెంట్.. అంతలోనే..

image

లద్దాక్‌లో ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో మృతి చెందిన బొత్సవానివలసకు చెందిన జవాన్‌ <<13611983>>గొట్టాపు శంకర్రావు<<>>(41) మరో ఆరు నెలల్లో రిటైర్ కాబోతున్నారు. 2003లో ఆర్మీలో చేరిన ఆయన మెకానిక్‌గా పనిచేస్తున్నారు. శంకర్రావుకు భార్య, తొమ్మిదేళ్ల పాప, ఏడేళ్ల బాబు ఉన్నారు. ఫిబ్రవరిలో ఇంటికి వచ్చి సరదాగా గడిపారని అతని తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తున్నారు. మృతదేహాన్ని హెలికాప్టర్‌లో స్వగ్రామానికి తీసుకురానున్నారు.

Similar News

News September 30, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి కొండపల్లి సమీక్ష

image

సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం రాత్రి దత్తి గ్రామంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన దాదాపు రోజంతా గ్రామంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటనల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, JC సేధు మాధవన్ పాల్గొన్నారు.

News September 29, 2025

VZM: పాల ప్యాకెట్ ధర తగ్గిందా?

image

ఇటీవల సవరించిన జీఎస్టి రేట్లతో పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయని పలు డెయిరీ యాజమాన్యాలు ప్రకటించాయి. విశాఖ డెయిరీలో మొత్తం 188 ఉత్పత్తుల్లో 94 ఉత్పత్తుల గరిష్ఠ పాల ఉత్పత్తుల <<17788908>>ధరలు తగ్గనున్నాయని<<>> తెలిపింది. పాలు లీటరుకు రూ.2 నుంచి రూ.3 వరకు తగ్గనుందని వెల్లడించింది. పనీర్ కేజీ ప్యాకెట్ ధర రూ.20, నెయ్యి కేజీకి రూ.42 వరకు తగ్గుతాయని చెప్పింది. మరి క్షేత్రస్థాయిలో రేట్లు తగ్గాయా కామెంట్ చెయ్యండి.

News September 29, 2025

VZM: కలెక్టరేట్‌లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అర్జీదారులు Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో కూడా వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు.