News July 12, 2024

‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పేరు తొలగింపు

image

AP: గృహ నిర్మాణ పథకానికి గత YCP ప్రభుత్వం పెట్టిన నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పేరును కూటమి సర్కార్ తొలగించింది. పూర్తైన ఇళ్లకు సంబంధించి పాస్ పుస్తకాలు, సర్టిఫికెట్లపై జగన్ బొమ్మలు, YCP రంగులు వేయొద్దని, స్వాగత ద్వారాలపై పేర్లు నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. కొత్త పేర్లు పెట్టే వరకు 2019కి ముందున్న పేర్లు కొనసాగించాలంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కుని వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకంగా మార్చింది.

Similar News

News October 20, 2025

దర్శకుడిగా మారిన హీరో.. గుర్తుపట్టలేని విధంగా లుక్!

image

విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ‘మకుటం’ మూవీ నుంచి దీపావళి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. ఇందులో విశాల్ సూట్ ధరించి తెల్లగడ్డం, కళ్లద్దాలతో గుర్తుపట్టలేని లుక్‌లో ఉన్నారు. ఈ మూవీతో తాను దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నానని, పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని విశాల్ తెలిపారు. దుషార విజయన్, అంజలి తదితరులు నటిస్తున్న ఈ మూవీని RB చౌదరి నిర్మిస్తుండగా, GV ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.

News October 20, 2025

రియాజ్ ఎన్‌కౌంటర్‌‌పై కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబం హర్షం

image

TG: రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంపై కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ప్రణీత ఆనందం వ్యక్తం చేశారు. పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమోద్ మృతికి న్యాయం జరిగిందని, రౌడీ షీటర్లను ఏరిపారేయాలని ఆమె కోరారు. ప్రమోద్ సోదరి మాధవి, గూపన్‌పల్లి గ్రామస్థులు సైతం పోలీసుల చర్యను హర్షించారు. రియాజ్ <<18056853>>కత్తితో దాడి<<>> చేయడంతో కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోయిన విషయం తెలిసిందే.

News October 20, 2025

కాసేపట్లో భారీ వర్షం..

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కాసేపట్లో యాదాద్రి భువనగిరి, జనగామ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి ఉదయంలోపు వానలు పడతాయని పేర్కొన్నారు. అటు ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.