News July 12, 2024
గాజువాక: సచివాలయ సిబ్బంది మధ్య కొట్లాట ..!

గాజువాక సమీపంలో 67వ వార్డు జోగవానిపాలెం సచివాలయంలో సిబ్బంది కొట్లాటకు దిగారు. పింఛనుదారుల చిరునామా వివరాలను అనుసంధానం చేసే క్రమంలో వార్డు వెల్ఫేర్ సెక్రటరీ జల్లూరి సమరం, ప్లానింగ్ సెక్రటరీ అన్నెపు శ్రీనివాస్ వాదులాటకు దిగుతూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సచివాలయ ఉద్యోగి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా వారు పట్టించుకోలేదు. ఈ ఘటనపై గాజువాక జోనల్ కమిషనర్ బి.సన్యాసినాయుడు గురువారం విచారణకు ఆదేశించారు.
Similar News
News March 11, 2025
ఇనాం భూముల సమస్యలు పరిష్కరించండి: గంటా

ఇనాం భూముల సమస్యలను పరిష్కరించాలని భీమిలి MLA గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో కోరారు. ఆ భూములపై యాజమన్య హక్కులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వారి ఆధీనంలో ఉన్నా సరే పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకొని మధ్యే మార్గంగా సమస్య పరిష్కరించాలని కోరారు. దీంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుందన్నారు.
News March 11, 2025
హయగ్రీవ భూములలో బోర్డులు పాతిన అధికారులు

ఎండాడలో హయగ్రీవ డెవలపర్స్‌కు కేటాయించిన 12 ఎకరాల 51 సెంట్ల భూమిని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వృద్ధులకు ఓల్డేజ్ హోం నిర్మాణం పేరుతో తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు విచారణలో తేలింది. దీంతో వెంటనే ఈ భూమి స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్‌పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు ఆ భూమిలో బోర్డులు పాతారు.
News March 11, 2025
విశాఖలోని 13 రైతు బజార్లలో నేటి కాయగూరల ధరలు

విశాఖలోని 13 రైతు బజార్లలో మంగళవారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు.(రూ/కేజీలలో) టమాటా కేజీ రూ.13, ఉల్లి రూ.27, బంగాళాదుంప రూ.15, నల్లవంకాయలు రూ.30, బెండకాయలు రూ.42, మిర్చి రూ.32, దొండ రూ.38, బరబాటి రూ.38, క్యారెట్ రూ.30/38, వెల్లుల్లి రూ.90/100గా, బీట్ రూట్ రూ.24, కీరా రూ.22, గ్రీన్ పీస్ రూ.50, పెన్సిల్ బీన్స్ రూ.50, కాకర కాయ రూ.44, పొటల్స్ రూ.90, చేమదుంప రూ.34గా నిర్ణయించారు.