News July 12, 2024
గొడ్డలితో దుండగుల దాడి.. పోలీసుల కాల్పులు

TG: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. అందులో ఒకరు గొడ్డలితో దాడి చేయబోగా మరో వ్యక్తి రాళ్లు విసిరి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన ఏఆర్ కానిస్టేబుల్ పారిపోతున్న వారిపై కాల్పులు జరిపాడు. ఇందులో రాజు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. నిందితులను చైన్ స్నాచర్లుగా అనుమానిస్తున్నారు.
Similar News
News January 12, 2026
అక్కడ 16 ఏళ్లలోపు వారికి నో SM… మనదగ్గర?

16 ఏళ్లలోపు పిల్లలకు DEC 10 నుంచి SMను ఆస్ట్రేలియా నిషేధించడం తెలిసిందే. ఈ ప్లాట్ ఫారాలకు ఆ వయసులోపు వారిని దూరంగా ఉంచాలని లేకుంటే జరిమానా తప్పదని హెచ్చరించింది. దీంతో సోషల్ మీడియా సంస్థలు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే మెటా 5,50,000 ఖాతాలను మూసివేసింది. ఇందులో ఇన్‌స్టాగ్రామ్ నుంచి 3,30,000, ఫేస్‌బుక్ 1,73,000, థ్రెడ్‌లో 40,000 ఖాతాలు రద్దయ్యాయి. మన దగ్గర కూడా ఇలా చేయాలని కోరుతున్నారు. మీరేమంటారు?
News January 12, 2026
చర్మాన్ని ఇలా హైడ్రేట్ చెయ్యండి..

కాలం ఏదైనా చర్మం ఆరోగ్యంగా, తాజాగా కనిపించడానికి తేమ కావాలి. వయసు పైబడటం, ఎండ వేడికి చర్మం పాడవడం వల్ల చర్మ కణాల్లో నీటిశాతం తగ్గిపోతుంది. కాబట్టి చర్మానికి హైడ్రేటర్లను అందించాలి. మాయిశ్చరైజర్లతో పోలిస్తే హైడ్రేటర్లు కణాల మధ్య నీటిని పట్టి ఉంచడంలో సాయపడతాయి. గ్లిజరిన్, హ్యాలురోనిక్ ఆసిడ్ వంటివి హైడ్రేటర్లు. వాటిని తప్పక వాడాలి. వీటితో పాటు వారానికి రెండుసార్లు స్క్రబింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.
News January 12, 2026
కోల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

కోల్ ఇండియా లిమిటెడ్(<


