News July 12, 2024

అక్టోబర్ 18 నుంచి 4 రైళ్ల వేళల్లో మార్పు

image

OCT18 నుంచి సింహపురి, పద్మావతి, నారాయణాద్రి, నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ వేళలు మారుతాయని SCR ప్రకటించింది. SECBAD-గూడూరు సింహపురి(12710) రా.10.35కి బదులు రా.10.05కి బయల్దేరుతుంది. SECBAD-తిరుపతి పద్మావతి(12764) గూడూరును ఉ.4.43కి బదులు ఉ.4.19కి చేరుతుంది. లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి(12734) సా.6.25కి బదులు సా.5.30 స్టార్టవుతుంది. నర్సాపూర్-నాగర్‌సోల్(17231) రా.11.15కు బదులు రా.9.50కి బయల్దేరుతుంది.

Similar News

News January 19, 2025

సీజ్‌ఫైర్: హమాస్ చెర నుంచి ముగ్గురు బందీలు విడుదల

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగిన గాజా కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో బందీల తొలి ఎక్స్ఛేంజీ జరిగింది. తమ చెరలో ఉన్న ముగ్గురిని ఇజ్రాయెల్‌కు హమాస్ అప్పగించింది. ఇందుకు బదులుగా తమ వద్ద ఉన్న 90 మంది పాలస్తీనా ఖైదీలను మరికొన్ని గంటల్లో ఇజ్రాయెల్ రిలీజ్ చేయనుంది. ఆ తర్వాత దశలో మరో 33 మంది ఇజ్రాయెలీలు హమాస్ చెర నుంచి విముక్తి పొందనున్నారు. బందీల మార్పు ప్రక్రియ 42 రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

News January 19, 2025

షకీబ్‌పై అరెస్ట్ వారెంట్

image

బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్, ఎంపీ షకీబ్ అల్ హసన్‌కు మరో షాక్ తగిలింది. IFIC బ్యాంకుకు సంబంధించి 3 లక్షల డాలర్ల చెక్ బౌన్స్ కేసులో ఢాకా కోర్టు అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తమ ముందు హాజరుకావాలని సమన్లు ఇచ్చినా షకీబ్ స్పందించకపోవడంతో న్యాయస్థానం చర్యలకు దిగింది. కాగా ఇటీవల అతని బౌలింగ్‌పై ఐసీసీ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాతి నుంచి అతను విదేశాల్లోనే ఉంటున్నారు.

News January 19, 2025

అది సైఫ్ నివాసమని దొంగకు తెలియదు: అజిత్

image

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి నేపథ్యంలో ముంబైలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఖండించారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. నిందితుడికి అది సెలబ్రిటీ నివాసమని తెలియదని, దొంగతనం కోసమే వెళ్లాడని తెలిపారు. అతడు బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వచ్చి తర్వాత ముంబైకి మకాం మార్చాడన్నారు. కాగా నిందితుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.