News July 12, 2024
బీటెక్ విద్యార్థులకు గుడ్‌న్యూస్
TG: ఇంజినీరింగ్‌లో బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, బీమా(BFSI) కోర్సును ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఈ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉండటంతో బీటెక్‌లో దీనిని మైనర్ డిగ్రీగా ప్రవేశపెట్టనుంది. BFSI ప్రతినిధులు ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థుల్ని ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. విద్యార్థులు తమ టెక్నికల్ బ్రాంచీతో పాటే ఈ కోర్సునూ చదవొచ్చు. రాష్ట్రంలో ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు.
Similar News
News January 21, 2025
రంజీ క్రికెట్ ఆడనున్న విరాట్ కోహ్లీ
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 30న రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌కు తాను అందుబాటులో ఉంటానని ఢిల్లీ&డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(DDCA) ప్రెసిడెంట్ రోహన్ జైట్లీకి విరాట్ సమాచారం ఇచ్చినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. 2012లో కోహ్లీ చివరిసారి రంజీ మ్యాచ్ ఆడారు. అటు CT-2025 ముందు రోహిత్, రాహుల్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.
News January 21, 2025
పనామా కాలువను స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్
అమెరికాకు స్వర్ణయుగం మొదలైందని, ప్రపంచంలో ఎవరూ ఊహించని విధంగా తమ దేశ సైన్యాన్ని తయారు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘చైనా అధీనంలోని పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటాం. ఇకపై శత్రువులపై పోరాటమే అమెరికా దళాలకు ఏకైక లక్ష్యం. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తాం. ధరలు తగ్గించి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తాం’ అని ట్రంప్ తెలిపారు.
News January 21, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 21, మంగళవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.29 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6.05 గంటలకు ✒ ఇష: రాత్రి 7.21 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.