News July 12, 2024

విశాఖ: పవన్ కళ్యాణ్‌కు విశ్రాంత ఐఏఎస్ లేఖ

image

విశాఖ ముడసర్లోవ పార్కులో నిర్మాణాలు చేపట్టడం పర్యావరణానికి హానికరమని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. రిజర్వాయర్ ‌కు ఆనుకుని ఉన్న పార్కు ప్రదేశంలో 105 రకాల పక్షులను శాస్త్రవేత్తలు గుర్తించారని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతంలో జీవీఎంసీ భవనాల నిర్మాణానికి 228 చెట్లను తరలించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కట్టడాలు నిర్మించడం చట్ట విరుద్ధం అన్నారు.

Similar News

News November 11, 2025

విశాఖ: అబార్షన్ కిట్ అమ్ముతున్న మెడికల్ షాప్‌పై కేసు

image

డాక్టర్ మందులు చీటీ లేకుండా గర్భాన్ని తొలగించేందుకు వాడే మందులను అమ్ముతున్న మెడికల్ షాప్‌పై విశాఖ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడులు చేశారు. సీపీ సూచనలతో గోపాలపట్నంలోని దర్విన్ ఫార్మసీపై మంగళవారం దాడులు చేయగా ఆరు కిట్లు స్వాధీనం చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. దుకాణంపై కేసు నమోదు చేసి మందులను డ్రగ్ కంట్రోలర్ అప్పగిస్తామని వెల్లడించారు.

News November 11, 2025

పెదగంట్యాడలో ఎంఎస్ఎంఈ పార్క్‌కు శంకస్థాపన

image

రాష్ట్రంలో ప్రతి ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని విశాఖ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం పెదగంట్యాడలో ఎం.ఎస్.ఎం.ఈ పార్క్‌కి మంత్రులు డీఎస్ బీవీ స్వామి, వాసంశెట్టి సుభాష్, ఎంపీ శ్రీ భరత్ శంఖుస్థాపన చేశారు. ఒకే రోజు రాష్ట్రంలో 27 ఎం.ఎస్.ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయడం చారిత్రాత్మక ఘట్టం అన్నారు.

News November 11, 2025

పైనాపిల్ కాలనీలో ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన

image

జీవీఎంసీ 13వ వార్డు పైనాపిల్ కాలనీలో పరిశ్రమల ఉపాధి కల్పనలో భాగంగా ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రూ.7.3 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ప్రతీ ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు.