News July 12, 2024

మంచిర్యాల: జువెలర్స్ యజమానుల పరారీ..!

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ జువెలర్స్ షాప్ యజమానులు పట్టణ ప్రజలకు రూ.కోట్లలో టోకరా వేసి పరారయ్యారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో సంచలనం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని జువెలర్స్ యజమాని, అతని కుమారుడు కొంతకాలంగా నమ్మకంగా ఉంటూ పలువురు నుంచి బంగారు ఆభరణాలతో పాటు నగదు రూపంలో పెద్ద ఎత్తున అప్పులు చేసి పరారయ్యారని తెలిపారు. గురువారం మొత్తం కుటుంబ సభ్యులు ఇంటిని వదిలి వెళ్ళిపోయారన్నారు.

Similar News

News March 12, 2025

గ్రూప్‌2 ఫలితాల్లో.. ADB వాసికి STATE 5TH ర్యాంక్

image

గ్రూప్‌2 ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకులు సత్తా చాటారు. ఇందులో భాగంగా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన చింతలపల్లి వెంకట్ రెడ్డి కుమారుడు చింతలపల్లి ప్రీతంరెడ్డి గ్రూప్‌2 ఫలితాల్లో 431 మార్కులు సాధించారు. కాగా రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు స్థానంలో నిలిచారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు.

News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. ఆదిలాబాద్‌కు ఏం కావాలంటే..!

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కోరాట చనాక ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించి పూర్తిచేయాలని, కుప్టి ప్రాజెక్ట్‌ ప్రారంభించాలని కోరుతున్నారు. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించి పునఃప్రారంభిస్తే ఎందరికో ఉపాధి దొరుకుతుంది. బోథ్‌కు రెవెన్యూ డివిజన్ ప్రకటనపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

News March 12, 2025

గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటిన ADB బిడ్డ

image

బజార్హత్నూర్‌కు చెందిన బిట్లింగ్ లక్ష్మణ్, నీల దంపతుల కుమారుడు ఉదయ్ 404 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 51వ ర్యాంక్ సాధించి తమ ప్రతిభ కనబర్చారు. ఉదయ్ పంచాయతీ కార్యదర్శి, ఫారెస్ట్ బీట్ అధికారి, వీఆర్వో, గ్రూప్ -4, సింగరేణి (ఎస్‌సీ‌సీ‌ఎల్ )జాబ్ సంపాదించి మరోపక్క గ్రూప్‌2కు సన్నద్ధమయ్యాడు. మంగళవారం వెలువడిన గ్రూప్‌2 ఫలితాల్లో ఉద్యోగం సాధించడం పట్ల అభ్యర్థుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

error: Content is protected !!