News July 12, 2024
శ్రీకాకుళం: రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

శ్రీకాకుళం జిల్లా పూండి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి ఓ యువకుడు మృతిచెందాడు. మృతదేహాన్ని రైలు పట్టాలపై గుర్తించిన స్థానికులు పలాస జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై షరీఫ్ మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 19, 2026
SKLM: నేటి నుంచి సురభి నాటక వైభవం

కళల కాణాచి శ్రీకాకుళం నగరంలో పౌరాణిక నాటక సందడి మొదలవనుంది. అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రసిద్ధ సురభి నాటక సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరగనున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఈ నాటకోత్సవాలు జరుగుతాయి. స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియం వేదికగా సోమవారం (జనవరి 19) నుంచి ఐదు రోజుల పాటు ప్రదర్శనలు కొనసాగనున్నాయి.
News January 19, 2026
SKLM: నేడే హెలికాప్టర్ రైడ్..టికెట్ ధర ఎంతంటే?

రథసప్తమి వేడుకల సందర్భంగా సోమవారం (జనవరి 19) నుంచి హెలికాప్టర్ రైడింగ్ జరుగనుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద ఆఫ్‌లైన్‌లోనే 3 కౌంటర్ల ద్వారా టికెట్ల విక్రయాలు జరుగుతాయన్నారు. హెలికాప్టర్ రైడింగ్ చేసేవారు రూ.2,200 టికెటు తీసుకోవాలన్నారు. ఉదయం 10 గంటల నుంచే మొదలై, రోజుకు 200-250 మంది వరకు రైడ్‌లో వెళ్లే అవకాశం ఉంటుందన్నారు.
News January 19, 2026
ఆదిత్యుని దర్శనానికి టికెట్ బుకింగ్ ఇలా!

రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిత్యుని దర్శనానికి భక్తుల సౌకర్యార్థం ఈ నెల 25న ప్రత్యేక స్లాట్లను ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వహణాధికారి కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. దర్శన టికెట్లకు అధికారిక వెబ్‌సైట్ https://www.aptemples.gov.in లేదా ‘మన మిత్ర’ వాట్సాప్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో పొందవచ్చన్నారు. ఈ నెల 19-23 వరకు రోజుకు 450 చొప్పున, 24వ తేదీన 1,750 టికెట్లు ఉంటాయన్నారు.


