News July 12, 2024
ED అదుపులోకి కర్ణాటక కాంగ్రెస్ MLA

వాల్మీకి కార్పొరేషన్ స్కాం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ MLA నాగేంద్రను ED అదుపులోకి తీసుకుంది. ఆయన షెడ్యూల్ తెగల సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న సమయంలో భారీ స్కామ్‌కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఈ శాఖ అకౌంట్స్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సూసైడ్ లెటర్‌లో పలువురి పేర్లు రాసిన విషయం తెలిసిందే. అప్పుడే నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Similar News
News January 25, 2026
ప్రియుడి ఇంటికి నిప్పు.. చివరికి

AP: ప్రియుడిపై కోపంతో అతడి ఇంటికి ప్రియురాలు నిప్పు పెట్టిన ఘటన గుంటూరులోని సుద్దపల్లిలో చోటు చేసుకుంది. వివాహితుడైన మల్లేశ్(31)తో దుర్గ(28) అక్రమసంబంధం పెట్టుకోగా ఇరువురి మధ్య గొడవలు పెరిగాయి. ఈ క్రమంలో ప్రియుడు కుటుంబం ఇంట్లో ఉండగా దుర్గ పెట్రోల్ పోసి నిప్పంటించింది. పెట్రోల్ మీద పడి దుర్గకు కూడా తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
News January 25, 2026
పాక్ మాజీ క్రికెటర్ కొడుకుపై రేప్ కేసు!

పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ ఖాదిర్ కొడుకు సులామన్ తనను రేప్ చేశారని పనిమనిషి కేసు పెట్టారు. ఇంట్లో పని చేయడానికి వచ్చిన తనను బలవంతంగా ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు గురిచేసినట్టు ఆరోపించారు. విచారణ కోసం నిందితుడిని అదుపులోకి తీసుకుని, బాధితురాలిని మెడికల్ టెస్టులకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. సులామన్ 2005-2013 మధ్య 26 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 40 లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడారు.
News January 25, 2026
రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం: సీఎం

AP: కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రాజెక్టులకు నిధులు సాధించాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకంగా ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్, పూర్వోదయ పథకం, పోలవరం-నల్లమల సాగర్, అమరావతికి చట్టబద్ధతను ప్రాధాన్యతాంశాలుగా తీసుకోవాలని చెప్పారు. కేంద్ర మంత్రులు, అధికారులతో టచ్‌లో ఉండాలని పేర్కొన్నారు. సభలో ప్రతి ఒక్కరూ మాట్లాడాలని సూచించారు.


