News July 12, 2024
దారుణం.. దళిత యువకుడితో మూత్రం తాగించారు

UPలోని శ్రావస్తి జిల్లాలో దారుణం జరిగింది. తమ ఫంక్షన్‌కు ఎక్కువ డబ్బు తీసుకున్నాడనే సాకుతో DJ ఆపరేటర్(15ఏళ్ల బాలుడు)తో కొందరు యువకులు మూత్రం తాగించారు. లిక్కర్ బాటిల్‌లో మూత్రం పోసి బలవంతంగా బాధితుడితో తాగించి వీడియో తీశారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులైన కిషన్ తివారీ, దిలీప్ మిశ్రా, సత్యం తివారీ మద్యం మత్తులో ఈ దారుణం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Similar News
News April 7, 2026
గెజిట్ నోటిఫికేషన్‌లో 2024 జూన్ 2 ఎందుకు?

AP: కేంద్రం 2024 జూన్ 2 నుంచి అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తింపునిస్తూ నిన్న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్ పదేళ్ల పాటు ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. ఆ సమయం ముగిశాక హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే క్యాపిటల్ అవుతుంది. ఏపీకి కొత్త రాజధాని రావాలి. అంటే 2024 జూన్ 2 నుంచి ఏపీకి కొత్త రాజధాని వచ్చిందన్నమాట.
News April 7, 2026
IPL వల్లే నా కెరీర్ ముగిసింది: పీటర్సన్

IPL పట్ల తనకున్న ఆసక్తే తన అంతర్జాతీయ కెరీర్ ముగియడానికి కారణమని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఆరోపించారు. IPL ఆడేందుకు అనుమతించని ECB తనను మీడియా ద్వారా వేధించిందని పేర్కొన్నారు. దీనివల్ల 150 టెస్టులు ఆడాల్సిన తాను 104 మ్యాచ్‌లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన పోరాటం వల్లే నేటి తరం ఇంగ్లిష్ ఆటగాళ్లు IPL ద్వారా భారీగా సంపాదిస్తున్నారని గుర్తు చేశారు.
News April 7, 2026
ఎయిరిండియా CEO విల్సన్ రాజీనామా

ఎయిరిండియా CEO క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా చేశారు. ఇంకా ఏడాది పదవీకాలం ఉన్నప్పటికీ ముందే తప్పుకొన్నారు. గత వారం జరిగిన బోర్డు సమావేశంలో ఆయన రాజీనామాను ఆమోదించారు. అయితే కొత్త CEOను ఎంపిక చేసే వరకు ఆయన విధుల్లో కొనసాగుతారు. గత ఏడాది జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన రిపోర్ట్ జూన్‌లో రావాల్సి ఉంది. మరోవైపు కంపెనీ నష్టాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన రాజీనామా చేయడం గమనార్హం.


