News July 12, 2024

‘భారతీయుడు-2’ రివ్యూ&రేటింగ్

image

అవినీతిపై పోరాటాన్ని డైరెక్టర్ శంకర్ ‘భారతీయుడు-2’లో కంటిన్యూ చేశారు. సేనాపతిగా కమల్ హాసన్ ఎంట్రీ, శంకర్ విజువల్స్, సిద్ధార్థ్ రోల్ ఆకట్టుకుంటాయి. స్టోరీలో ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడం, ఇంట్రెస్టింగ్ సీన్లు లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్. కమల్ హాసన్ మేకప్, అనిరుధ్ BGM వర్కౌట్ కాలేదు. ‘భారతీయుడు’తో సంచలనం సృష్టించిన డైరెక్టర్ శంకర్ మార్క్ ఈ మూవీలో మిస్ అయింది.
RATING: 2/5

Similar News

News October 31, 2024

వేద పండితులకు రూ.3,000.. ఉత్తర్వులు జారీ

image

AP: రాష్ట్రంలోని వేద పండితులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 600 మందికి సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, శ్రీశైలం, కాణిపాకం ఆలయాల నుంచి సంభావన చెల్లించాలని పేర్కొంది. ఈ సాయం పొందే పండితులు వారి నివాసానికి సమీపంలోని ఆలయంలో రోజూ గంటపాటు వేద పారాయణం చేయాలంది.

News October 31, 2024

ఈ ఆలయం దీపావళి రోజు మాత్రమే తెరుస్తారు

image

కర్ణాటకలోని హసన్‌ పట్టణంలో ఉన్న హసనాంబా ఆలయంలో దుర్గాదేవి హసనాంబాదేవిగా పూజలందుకుంటారు. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు. దీపావళి రోజు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. అవి పదిరోజుల పాటు కొనసాగుతాయి. ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. మీ ప్రాంతంలో ఇలాంటి ఆలయాలు ఉన్నాయా? కామెంట్ చేయండి.

News October 31, 2024

మాజీ మంత్రి అప్పలరాజుకు తీవ్ర అస్వస్థత

image

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న పలాసలోని ఇంటి వద్ద వ్యాయామం చేస్తుండగా కుప్పకూలారు. వెంటనే కుటుంబసభ్యులు శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.