News July 12, 2024

చదువుకున్న వాళ్లకు పోటీ పరీక్షల విలువ తెలుస్తుంది: MP రఘునందన్

image

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. HYDలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చదువుకున్న వారికే పోటీ పరీక్షల విలువ తెలుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాట మాట్లాడుతోందన్నారు. గ్రూప్ 1 పోస్టులు తక్కువ ఇచ్చారని గతంలో కాంగ్రెస్ చెప్పిందని, అధికారంలోకి వచ్చాక కేవలం 60 పోస్టులు మాత్రమే పెంచిందని పేర్కొన్నారు.

Similar News

News March 5, 2026

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయొద్దని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు శాశ్వత నివాసాలు కల్పించడం లక్ష్యమని తెలిపారు. పనులు వేగంగా పూర్తి చేసి నాణ్యతలో రాజీ పడకూడదన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని, బిల్లులు, సామగ్రి సరఫరా, సాంకేతిక పర్యవేక్షణపై అధికారులకు సూచనలు చేశారు.

News March 5, 2026

మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు రూ.111 కోట్లు విడుదల

image

మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం 5,201 ఇళ్లకు రూ.111 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. బుధవారం కౌడిపల్లిలో నూతనంగా నిర్మించిన ఇళ్లను ఆమె స్వయంగా పరిశీలించారు. లబ్ధిదారులు పనులు వేగవంతం చేయాలని, ప్రతివారం బిల్లులు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం కావాలని సూచించారు.

News March 4, 2026

మెదక్: రేపటి నుంచి జనగణన శిక్షణకు డీఎస్ఓ

image

మెదక్ జిల్లా సైన్స్ అధికారి(DSO) రాజిరెడ్డి బుధవారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. రేపటి నుండి హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో జరిగే జనగణన శిక్షణకు తాను హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే వేసవిలో చేపట్టనున్న మొదటి దశ ఇళ్ల గణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని రాజిరెడ్డి వెల్లడించారు.