News July 12, 2024
ఇండియా వెళ్లకపోతే శ్రీలంకకు ఛాన్స్!

పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ2025లో పాల్గొనకూడదని భారత్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. టోర్నీ నుంచి భారత్ వైదొలిగితే అది శ్రీలంకకు కలిసి వస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయిన లంకకు ఛాన్స్ వస్తుంది. ఇందులో ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ ఆడాల్సి ఉంది. PAKలో కాకుండా ఎక్కడ నిర్వహించినా తామూ పాల్గొంటామని భారత్ అంటోంది.
Similar News
News January 28, 2026
ఫ్యాన్ వార్స్ వల్ల సినిమాలకు నష్టం లేదు: అనిల్ రావిపూడి

సినిమా రిజల్ట్‌పై ఫ్యాన్ వార్స్ ప్రభావం ఏమాత్రం ఉండదని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఓ హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు ఇతర హీరోల అభిమానులు నెగటివ్ ప్రచారం చేయడంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ఏం చేసినా ఫ్యాన్ వార్స్ ఆగవు. కానీ వాటి వల్ల సినిమాకి వచ్చే రెవెన్యూలో అర్ధ రూపాయి కూడా తగ్గదు’ అని అభిప్రాయపడ్డారు. మూవీ బాగుంటే ఫ్యాన్స్‌తో పాటు జనరల్ ఆడియన్స్ ఆదరిస్తారని పేర్కొన్నారు.
News January 28, 2026
జనవరి 28: చరిత్రలో ఈరోజు

1865: జాతీయోద్యమ నాయకుడు లాలా లజపతిరాయ్ జననం (ఫొటోలో)
1885: భాషా పరిశోధకుడు గిడుగు వెంకట సీతాపతి జననం
1920: నిర్మాత, దర్శకుడు బి.విఠలాచార్య జననం
1929: భారత అణు శాస్త్రవేత్త రాజారామన్న జననం
1950: భారత సుప్రీంకోర్టు ప్రారంభం
1986: హీరోయిన్ శ్రుతి హాసన్ జననం
2004: నటుడు, దర్శకుడు పామర్తి సుబ్బారావు మరణం
2014: దర్శకుడు, నట శిక్షకుడు బీరం మస్తాన్‌రావు మరణం
News January 28, 2026
జలుబుతో గొంతు బొంగురుపోయిందా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..

జలుబు తర్వాత గొంతు బొంగురుపోవడం లేదా వాయిస్ పడిపోవడం లారింజైటిస్ వల్ల జరుగుతుంది. ఇన్ఫెక్షన్ కారణంగా వోకల్ కార్డ్స్ వాపునకు గురవడమే దీనికి కారణం. త్వరగా కోలుకోవాలంటే మాట్లాడకుండా గొంతుకు రెస్ట్ ఇవ్వాలి. తరచూ గోరువెచ్చని నీళ్లు తాగుతూ గొంతును తడి చేసుకోవాలి. ఉప్పు నీళ్లతో పుక్కిలించడం, తేనె తీసుకోవడం వల్ల వాపు తగ్గుతుంది. స్మోకింగ్, డ్రింకింగ్, కారాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.


