News July 12, 2024
వర్ధన్నపేట: సినిమా థియేటర్లో ఘర్షణ.. యువకుడికి కత్తిపోట్లు

వర్ధన్నపేటలోని ఓ సినిమా థియేటర్లో శుక్రవారం కొందరు వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు పాల్పడ్డారు. ఈ గొడవల్లో విజయ్ అనే యువకుడిపై కత్తితో దాడి చేశారు. సదరు యువకుడికి కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. థియేటర్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 26, 2025
WGL: మహిళా సంఘాల ఖాతాల్లో రూ.6.50 కోట్లు జమ

వరంగల్ జిల్లాలో రుణాలు సకాలంలో చెల్లించిన స్వయం సహాయక మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించింది. వడ్డీలేని రుణాల పథకం కింద 11 మండలాలకు రూ.6.50 కోట్లు విడుదల చేసి 7,540 సంఘాల ఖాతాల్లో జమ చేసింది. 2025-2028 రుణాలపై ఈ వడ్డీ రాయితీ వర్తించింది. అత్యధికంగా సంగెం మండలానికి రూ.79.52 లక్షలు, అత్యల్పంగా నెక్కొండకు రూ.76,958 లభించింది. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News December 24, 2025
వర్ధన్నపేట: ఏటీఎంలో కేటుగాడు

వర్ధన్నపేట ఎస్బీఐ బ్యాంకు ఏటీఎం వద్ద రైతు పిన్నింటి కిషన్‌రావు మోసానికి గురయ్యాడు. నగదు తీసుకునేందుకు వెళ్లిన సమయంలో దుండగుడు అతని ఏటీఎం కార్డును మార్చి రూ.40 వేల నగదు కాజేశాడు. గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మోసగాడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
News December 24, 2025
వరంగల్ ఎక్సైజ్ శాఖలో పదోన్నతులు

వరంగల్ డివిజన్ వ్యాప్తంగా 8 మంది ఎస్సైలకు సీఐగా పదోన్నతి కల్పించేందుకు డీపీసీ సిఫారసులను కమిషనర్ సి.హరికిరణ్ ఆమోదించారు. రోస్టర్ ప్రకారం రమాదేవి, రజిత, చంద్రశేఖర్, జ్యోతి, సరిత, అశోక్‌కుమార్ తదితరులకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. అలాగే శ్రీనివాస్‌రెడ్డి, మురళి ఎక్సైజ్ సూపరింటెండెంట్లుగా, అంజన్‌రావు జాయింట్ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. జీవో విడుదల అనంతరం పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.


