News July 12, 2024
విద్యార్థులకు అలర్ట్.. రేపే లాస్ట్ డేట్

TG: EAPCET కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు జులై 13వ తేదీతో ముగియనుంది. ఆప్షన్ల నమోదుకు జులై 15వ తేదీ వరకు అవకాశం ఉంది. ఇప్పటివరకు 99,170 మంది విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించగా, 60వేల మంది ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. జులై 19లోగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఆ తర్వాత జులై 23లోగా విద్యార్థులు కాలేజీల్లో ఫీజు చెల్లించి, వెబ్‌సైటు ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
Similar News
News August 31, 2025
ఆరునూరైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు: CM

TG: ఆరునూరైనా BCలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. BC రిజర్వేషన్ల కోసం డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేశామని, అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రపతి దగ్గర ఉందని, ఈ బిల్లును ఆమోదించాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. దీనిపై ఢిల్లీలో తాము ఆందోళన చేస్తే BRS MPలు ఎందుకు రాలేదని అసెంబ్లీలో CM ప్రశ్నించారు.
News August 31, 2025
మా సూచనలను పరిగణనలోకి తీసుకోలేదు: MLA గంగుల

TG: BCలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది, ఎలాంటి న్యాయ చిక్కులు లేకుండా అమలైతే తామూ సంతోషిస్తామని BRS MLA గంగుల కమలాకర్ తెలిపారు. ‘మేం BC బిల్లుకు గతంలో మద్దతు ఇచ్చాం. శాస్త్రీయ పరంగా చేస్తే సక్సెస్ అవుతుందని, అశాస్త్రీయంగా వెళ్తే కోర్టులో మొట్టికాయలు పడతాయని చెప్పాం. మా సూచనలను పరిగణనలోకి తీసుకోలేదు. మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన వేసిన BC కమిషన్ మాయమైంది’ అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.
News August 31, 2025
అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టిన ప్రభుత్వం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికను, పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఎమ్మెల్యేలకు పెన్ డ్రైవ్‌లో అందించింది. అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు బండారు రాజిరెడ్డి, బానోతు మదన్ లాల్ మృతి పట్ల సభలో సంతాపం ప్రకటించారు.