News July 12, 2024
ఏపీలో ఆ రెండు రోజులు భారీ వర్షాలు

ఆవర్తన ప్రభావంతో APలో వర్షాలు కురుస్తున్నాయి. రేపు మన్యం, అల్లూరి, ఉభయగోదావరి, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, NTR, నెల్లూరు, కర్నూలు, YSR, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయంది. ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Similar News
News November 6, 2025
రేషన్ షాపుల్లో రూ.18కే గోధుమ పిండి: నాదెండ్ల

AP: జనవరి 1 నుంచి పట్టణాల్లోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘2400 మెట్రిక్ టన్నులు సిద్ధం చేస్తున్నాం. కిలో రూ.18 చొప్పున రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తాం. నవంబర్‌లో వర్ష సూచన నేపథ్యంలో కౌలు రైతులకు ఉచితంగా 50 వేల టార్పాలిన్లు ఇస్తాం. ధాన్యం అమ్మిన రైతులకు అదే రోజు ఖాతాల్లో డబ్బు జమయ్యేలా ఏర్పాట్లు చేశాం. సెలవుంటే తర్వాత రోజు పడతాయి’ అని తెలిపారు.
News November 6, 2025
తడిసిన ధాన్యం కొంటాం: ఢిల్లీరావు

AP: 17% వరకు తేమ ఉన్న ధాన్యాన్నీ కొంటామని సివిల్ సప్లై కార్పొరేషన్ MD ఢిల్లీరావు రైతులకు హామీ ఇచ్చారు. వివిధ రైతు సంఘాల నేతలు ఆయన్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మద్దతు ధరకు అదనంగా గోనె సంచులు, రవాణా ఖర్చులివ్వాలని రైతులు కోరారు. మిల్లర్ల యాజమాన్యాల నుంచి వేధింపులను అడ్డుకోవాలన్నారు. పంటనష్ట పరిహారం, ధాన్యం కొనుగోలు, తేమశాతం అంచనాపై సమస్యలుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఢిల్లీరావు రైతులకు తెలిపారు.
News November 6, 2025
గోరింటాకు ధరించడం వెనుక శాస్త్రీయత

పెళ్లిళ్లు, పండుగలప్పుడు ఆడపిల్లలు గోరింటాకు ధరించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే, ఈ ఆచారం వెనుక కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. గోరింటాకు అనేది ఓ ఔషధ మూలిక. పెళ్లి చేసుకున్నప్పుడు నూతన వధువులో సహజంగానే కాస్త భయం, ఆందోళన ఉంటుంది. ఆ ఫీలింగ్స్‌ను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఒంట్లో వేడిని తగ్గించి, నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది.


