News July 13, 2024
HYD: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఎడ్యుకేషన్ లోన్

HYDలో ఎడ్యుకేషన్ లోన్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని SVITలో ఈ క్యాంప్ జరిగింది. జులై 15న షేక్‌పేటలోని నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ (11:30AM), 20న అబిడ్స్‌లోని మెథడిస్ట్ కాలేజీ (11:00AM)లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని విద్యార్థులు ఈ ఎడ్యుకేషన్ లోన్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SHARE IT
Similar News
News September 18, 2025
HYD: దుర్గామాత మండపాలకు అనుమతి తప్పనిసరి

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నిర్వాహకులు మండపాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వెబ్‌సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో నమోదు చేయాలన్నారు.
News September 18, 2025
HYD: వైద్య సేవల బలోపేతంపై మంత్రి సమీక్ష

ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రులలో వైద్య సేవల బలోపేతంపై మంత్రి దామోదర రాజనరసింహ ఎస్ఆర్ నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని పాత భవనాల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో పర్యటించి 2, 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని TGMSIDC ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
News September 18, 2025
చిత్ర పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: సీఎం

సినీ కార్మికులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నైపుణ్య శిక్షణ, ఆరోగ్య బీమా కల్పించి, చిన్న బడ్జెట్ సినిమాలకు సహాయం చేస్తామన్నారు. HYDను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్దామని చెప్పారు. ‘గద్దర్ అవార్డులు’ కొనసాగిస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలు స్వయంగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో, వారు కృతజ్ఞతలు తెలిపారు.