News July 13, 2024

వింబుల్డన్ ఫైనల్స్‌కు చేరుకున్న జకోవిచ్

image

సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ పురుషుల వింబుల్డన్‌లో ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఇటలీ ఆటగాడు లొరెంజో ముసెట్టిని ఆయన 3 వరస సెట్లలో ఓడించారు. రేపు జరిగే ఫైనల్‌లో ఆయన కార్లోస్ ఆల్కరాజ్‌తో తలపడతారు. అటు కార్లోస్ రష్యాకు చెందిన డానిల్ మెద్వెదేవ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే.

Similar News

News January 20, 2025

కాలేజీకి వెళ్లమన్నారని చనిపోయింది

image

TG: మెదక్ జిల్లా పొడ్చన్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. కాలేజీకి వెళ్లమన్నందుకు ఇంటర్ విద్యార్థిని సింధూజ(19) ఆత్మహత్య చేసుకుంది. నెల రోజులుగా ఆమె ఇంట్లోనే ఉంటోంది. దీంతో నిన్న పేరెంట్స్ కళాశాలకు వెళ్లాలని ఒత్తిడి చేశారు. మనస్తాపానికి గురైన సింధూజ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది.

News January 20, 2025

TODAY GOLD RATES

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.120 పెరిగి రూ.81,230కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.150 పెరిగి రూ.74,500గా నమోదైంది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ సిల్వర్ రేట్ రూ.1,04,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలున్నాయి.

News January 20, 2025

కోర్టుకు సంజయ్ రాయ్.. భారీ బందోబస్తు

image

కోల్‌కతా హత్యాచార కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌ని మరికాసేపట్లో సీల్దా కోర్టులో హాజరుపర్చనున్నారు. అతడిని ఉరి తీయాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంజయ్‌కి కోర్టు ఇవాళ శిక్షను ఖరారు చేయనుంది. అతడికి జీవితఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి.