News July 13, 2024
నా సినిమా ఫ్లాపయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు: అక్షయ్

తన సినిమాలు ఫ్లాపయితే కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తాజాగా వాపోయారు. ఆయన గత సినిమాలు బడే మియాన్ చోటే మియాన్, రామ్ సేతు, రక్షాబంధన్, బచ్చన్ పాండే, సెల్ఫీ బాక్సాఫీస్ వద్ద వరసగా విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వైఫల్యాల్ని ఎదుర్కోవడాన్ని అమితాబ్ బచ్చన్ నుంచి తాను నేర్చుకున్నానని, శ్రమనే నమ్ముకుంటానని తెలిపారు.
Similar News
News April 1, 2026
ఐడియా చెప్పండి.. రూ.10లక్షలు గెలుచుకోండి!

ప్లాస్టిక్ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘BIOPACKATHON 2026’ నిర్వహిస్తోంది. భూమిలో కరిగిపోయే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఐడియాలు ఇచ్చేవారికి భారీగా బహుమతులు అందిస్తారు. మొదటి బహుమతిగా ₹10 లక్షలు, సెకండ్ రూ.7లక్షలు, మూడో స్థానంలో నిలిచినవారు రూ.5లక్షలు గెలుచుకోవచ్చు. విజేతలకు నగదుతో పాటు పరిశ్రమలతో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఆసక్తి గల వారు ఏప్రిల్ 24, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
News April 1, 2026
అమరావతి బిల్లుకు కాంగ్రెస్ మద్దతు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతోంది. దీనికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ తరఫున మాణిక్కం ఠాకూర్ ప్రకటన చేశారు. ఇక చర్చకు వైసీపీ తరఫున ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ బిల్లుపై చర్చకు రెండు గంటలు కేటాయించాలని టీడీపీ ఎంపీలు కోరారు. అయితే తొలుత గంట పాటు చర్చిద్దామని, తర్వాత అవసరమైతే మరో గంట పొడిగిస్తానని స్పీకర్ ఓం బిర్లా హామీ ఇచ్చారు.
News April 1, 2026
మేం ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు: జగన్

AP: అమరావతికే కాకుండా రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ తాము వ్యతిరేకం కాదని ప్రెస్‌మీట్‌లో YCP చీఫ్ జగన్ స్పష్టం చేశారు. ‘అమరావతి పేరుపై అప్పులు తెచ్చి స్కామ్‌లు చేస్తున్నారు. లక్ష ఎకరాల్లో రోడ్లు, నీళ్లు, డ్రైనేజీకి రూ.2లక్షల కోట్లు కావాలి. అంత ఖర్చు చేసే స్థోమత మనకు ఉందా? ఏడేళ్లలో CBN ఖర్చు పెట్టింది రూ.8వేల కోట్లే. వీటికి అసెంబ్లీలో CBN సమాధానం చెప్పాడా?’ అని ప్రశ్నించారు.


