News July 13, 2024
అవే తప్పులు చేస్తే మనకీ వారికి తేడా ఏంటి?: గడ్కరీ

కాంగ్రెస్ చేసిన తప్పుల్నే చేస్తే బీజేపీకి, ఆ పార్టీకి తేడా ఏంటంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బీజేపీ నేతల్ని ప్రశ్నించారు. గోవాలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘బీజేపీ మిగతావాటికంటే భిన్నమైన పార్టీ. అదే మన ప్రత్యేకత అని అద్వానీ చెప్పేవారు. అధికారంలో ఉండగా చేసిన తప్పుల వల్లే కాంగ్రెస్ ఓడింది. మనం ఆ తప్పులకు దూరంగా ఉండాలి’ అని సూచించారు. అవినీతిరహిత దేశం కోసం పాటుపడాలని కోరారు.
Similar News
News January 12, 2026
చేనేత సహకార సంఘాలకు రూ.5 కోట్లు

AP: చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. DECలో ఆప్కో బకాయిల్లో రూ.2.42 కోట్లు చెల్లించారు. సంక్రాంతి సందర్భంగా మరో రూ.5 కోట్ల బకాయిలు చెల్లించాలని మంత్రి సవిత ఆప్కో యాజమాన్యాన్ని ఆదేశించారు. చేనేత ఉత్పత్తుల విక్రయాల కోసం కో ఆప్టెక్స్, టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్తో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, జియోమార్ట్ ద్వారా కూడా అమ్మకాలు ప్రారంభించామన్నారు.
News January 12, 2026
వచ్చే వారం ఇన్వెస్టర్ల ముందుకు ఆరు IPOలు

ఈ నెల 12 నుంచి 16 వరకు మార్కెట్కు ఆరు IPOలు రానున్నాయి. వీటిలో అమాగీ మీడియా ల్యాబ్స్ ఒక్కటే మెయిన్ బోర్డ్ ఐపీఓ కాగా, మిగతా ఐదు ఎస్ఎంఈ (Small and Medium Enterprises) విభాగానికి చెందినవే. అమాగీ ఐపీఓ జనవరి 13న ప్రారంభమై 16న ముగియనుంది. షేరు ధర రూ.343-361 మధ్య ఉండగా రూ.1,789 కోట్లు సమీకరించనుంది. ఇదిలా ఉండగా శుక్రవారం పబ్లిక్ ఇష్యూకు వచ్చిన భారత్ కోకింగ్ కోల్ ఐపీఓకు భారీ స్పందన లభిస్తోంది.
News January 12, 2026
శాస్త్రం చూసి మరీ కోడి పందేలు.. ఎందుకంటే?

గోదావరి జిల్లాల్లో కోడి పందేలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ పందెంలో గెలవడానికి పుంజుకి సత్తా ఉంటే సరిపోదట, గ్రహాలు కూడా అనుకూలించాలట. ఈ విషయాలు తెలుసుకోవడానికి ఓ గ్రంథమే అందుబాటులో ఉంది. అదే ‘కుక్కుట శాస్త్రం’. పందెం రాయుళ్లు కోడి పందేల సమయంలో ఈ గ్రంథంపైనే ఆధారపడతారట. అసలు ఈ గ్రంథంలో ఏముంటుంది? పందెం కోళ్ల విజయాలపై ఈ గ్రంథం ఏం చెబుతుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.


