News July 13, 2024
ఎన్డీయే సర్కారు మనుగడ కష్టమే: మమతా బెనర్జీ

మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు మనుగడ కష్టమేనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అస్థిరంగా కనిపిస్తోందని, పూర్తి కాలం కొనసాగకపోవచ్చని అభిప్రాయపడ్డారు. తాజాగా ముంబైకి చేరుకున్న ఆమె, ఇండియా కూటమి నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేతో వేర్వేరుగా భేటీ అయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన(ubt) తరఫున ప్రచారం చేయనున్నట్లు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.
Similar News
News April 6, 2026
బ్రాండింగ్ కోసం బౌండరీ దాటిన జొమాటో.. ఫ్యాన్స్ ఫైర్!

నిన్నటి IPL మ్యాచ్ సందర్భంగా జొమాటో చేసిన ఓ పోస్ట్ తమిళనాడు, కర్ణాటక అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ‘చెన్నై సాంబార్ కంటే బెంగళూరు సాంబార్ బెటర్’ అంటూ ZOMATO చేసిన పోస్ట్ తమ ప్రాంతీయ సంస్కృతిని, ఆహారపు అలవాట్లను కించపరిచేలా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రచారం కోసం ప్రాంతీయ సెంటిమెంట్లతో ఆడుకోవడం సరికాదని ఫైర్ అవుతున్నారు. చాలామంది జొమాటో యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసి పోస్టులు పెడుతున్నారు.
News April 6, 2026
కాలు వాపుగా ఉందా? ప్రాణాపాయం కావచ్చు: రాజీవ్ కనకాల

కాలు వాపు, నొప్పి లేదా వేడి చేసినా నిర్లక్ష్యం చేయవద్దని నటుడు రాజీవ్ కనకాల సూచించారు. ఇది రక్త గడ్డలకు (DVT) సంకేతం కావచ్చని హెచ్చరించారు. ‘ఈ గడ్డలు ఊపిరితిత్తులకు చేరితే ప్రాణాపాయం కలగవచ్చు. ఎక్కువసేపు కూర్చోవడం, లాంగ్ ట్రావెల్ చేసేవారు మధ్యమధ్యలో నడవాలి. నీళ్లు బాగా తాగాలి. సకాలంలో గుర్తిస్తే ఈ సమస్యను పూర్తిగా నివారించి ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు’అని ఆయన అవగాహన కల్పించారు.
News April 6, 2026
ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ.. 6 వేల మందికి ఉద్యోగాలు!

TG: 2026-27 నుంచి 3 వేల స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. UKG క్లాసులు అవసరమైన పాఠశాలల లిస్టు పంపాలని DEOలకు ఆదేశాలిచ్చింది. దీంతో కొత్తగా 6 వేల మందికి తాత్కాలికంగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం 1,300కు పైగా స్కూళ్లలో UKG క్లాసులు నడుస్తున్నాయి. వాటిలో ఆయాలు, ఇన్‌స్ట్రక్టర్లను నియమించి ₹6 వేలు, ₹8 వేల చొప్పున ప్రభుత్వం వేతనం ఇస్తోంది.


