News July 13, 2024

వచ్చే నెల నుంచి గ్రామస్థాయి నుంచి క్యాన్సర్ పరీక్షలు

image

AP: వచ్చే నెల 1 నుంచి గ్రామస్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు మొదలుపెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రధానంగా నోరు, గర్భాశయం, రొమ్ము క్యాన్సర్ పరీక్షలు ఉండనున్నాయి. ఇప్పటికే సుమారు 20వేలమందికి ఆరోగ్య శాఖ శిక్షణ పూర్తి చేసింది. చాలామంది ప్రజలు క్యాన్సర్ ముదిరేవరకు దాని గురించి తెలుసుకోలేపోతున్నారని.. ముందుగా వ్యాధిని గుర్తించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు వివరిస్తున్నారు.

Similar News

News January 17, 2026

మట్టి పాత్రకు ₹29 లక్షలు.. 91 ఏళ్ల బామ్మకు బర్త్‌డే సర్‌ప్రైజ్

image

బాల్కనీలో 40ఏళ్లు పడున్న మట్టి పాత్రకు ₹29 లక్షలు వచ్చాయంటే ఆశ్చర్యంగా ఉంది కదా? పైగా బర్త్‌డే రోజు ఆ సర్‌ప్రైజ్ అందితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నెబ్రాస్కా(US)లోని 91ఏళ్ల లోయిస్ జుర్గెన్స్ బామ్మ విషయంలో ఇదే జరిగింది. తొలుత ఆ పాత్రను 50 డాలర్లకు అమ్మాలకున్నారు. తర్వాత Bramer Auction గురించి తెలుసుకొని వేలంలో ఉంచారు. పాత్రపై ఉన్న అరుదైన బ్లూ బటర్‌ఫ్లై మార్కింగ్స్ వల్ల ఏకంగా 300 మంది పోటీ పడ్డారు.

News January 17, 2026

జనవరి 17: చరిత్రలో ఈరోజు

image

1908: సినీనిర్మాత, దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ జననం(ఫొటోలో)
1917: సినీ నటుడు, తమిళనాడు మాజీ సీఎం ఎం.జి.రామచంద్రన్ జననం
1942: బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ జననం
1945: తెలంగాణ కవి, రచయిత మడిపల్లి భద్రయ్య జయంతి
2010: బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసు మరణం
1989: దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి భారతీయుడు కల్నల్ జె.కె బజాజ్

News January 17, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.