News July 13, 2024

డీఎస్సీ అభ్యర్థులకు GOOD NEWS

image

TG: ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు ఉన్నవారు ఉదయం ఎగ్జామ్ రాసిన సెంటర్‌లోనే రెండోదానికి హాజరుకావచ్చని విద్యాశాఖ తెలిపింది. కొందరు అభ్యర్థులు నాన్ లోకల్ పోస్టులకు అప్లై చేయడంతో వారికి ఇతర జిల్లాలో కేంద్రాలిచ్చింది. దీంతో ఉదయం ఒక జిల్లాలో మధ్యాహ్నం మరొక జిల్లాలో పరీక్ష ఉండటంతో వారికి హాల్ టికెట్లు మార్చి ఇస్తామని పేర్కొంది. ఈ నెల 18 నుంచి DSC పరీక్షలు జరగనున్నాయి.

Similar News

News January 20, 2025

ప్రముఖ నటుడు గుండెపోటుతో కన్నుమూత

image

ప్రముఖ నటుడు విజయ రంగరాజు కన్నుమూశారు. చెన్నైలో గుండెపోటుకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే రంగరాజు ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. బాలకృష్ణ నటించిన భైరవద్వీపంతో పాపులర్ అయ్యారు. తర్వాత యజ్ఞం, సీమశాస్త్రి, జాంబిరెడ్డి, ఢమరుకం, శ్లోకం, మగరాయుడు, విశాఖ ఎక్స్‌ప్రెస్, మేడం సహా పలు సినిమాల్లో విజయ రంగరాజు నటించారు.

News January 20, 2025

Paytm Q3 Results: తగ్గిన నష్టం, పడిపోయిన ఆదాయం

image

Q3లో ఫిన్‌టెక్ మేజర్ Paytm నికర నష్టం రూ.219 కోట్ల నుంచి రూ.208 కోట్లకు తగ్గింది. ఆదాయంలో మాత్రం 36% మేర కోతపడింది. గత ఏడాది ఇదే సమయంలోని రూ.2,851 కోట్ల నుంచి రూ.1,828 కోట్లకు పడిపోయింది. GMV, చందాదారుల పెరుగుదలతో QoQ పద్ధతిన రెవెన్యూ 10% ఎగిసింది. నగదు రూ.2,851 కోట్లు పెరిగి రూ.12,850 కోట్లుగా ఉంది. PAYPAYలో వాటా విక్రయమే ఇందుకు కారణం. నేడు ఈ షేర్లు 1.35% ఎగిసి రూ.912 వద్ద ట్రేడవుతున్నాయి.

News January 20, 2025

జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్‌ విచారణ ధర్మాసనం మార్పు

image

AP: వైఎస్ జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్‌ విచారణ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరోసారి మార్చింది. గతంలో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం ఈ కేసులను విచారించగా, 12 ఏళ్లుగా ట్రయల్ అడుగు కూడా ముందుకు కదలలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తరఫు న్యాయవాది వాదించారు. దీంతో జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనానికి ట్రయల్‌ను మార్చింది.