News July 13, 2024
కొండేపి: పొగాకు గరిష్ఠ ధర కేజీ రూ.356
కొండేపి పొగాకు వేలం కేంద్రానికి నాణ్యమైన బేళ్లు తీసుకొచ్చి అధిక ధరలు పొందాలని వేలం నిర్వహణాధికారి సునీల్ కుమార్ సూచించారు. స్థానికుల పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం జరిగిన వేలంలో పొగాకు గరిష్ఠ ధర కేజీ రూ.356 పలికిందని తెలిపారు. రైతులు 1174 బేళ్లు వేలానికి తీసుకురాగా వాటిలో 1112 కొనుగోలయ్యాయి. కనిష్ఠ ధర కేజీ రూ.205, సరాసరి ధర రూ.282. 72 పలికిందన్నారు.
Similar News
News November 28, 2024
పెట్లూరు సచివాలయాన్ని తనిఖీ చేసిన మంత్రి స్వామి
కొండపి మండలం పెట్లూరులో గ్రామ సచివాలయాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రికార్డుల పరిశీలించి, నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బందిని రేషనలైజేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. సేవలన్నీ ప్రజలకు సకాలంలో అందించాలని ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు.
News November 28, 2024
టంగుటూరు మహిళ హత్య కేసులో కీలక UPDATE
టంగుటూరులో మంగళవారం జరిగిన<<14720727>> హైమావతి హత్య కేసు దర్యాప్తును<<>> పోలీసులు ముమ్మరం చేశారు. మృతురాలి భర్త, ఇతర అనుమానితుల కాల్ డేటాను ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోపక్క చుట్టుపక్కల CC కెమెరాలను చెక్ చేస్తున్నారు. అప్పటికీ మిస్టరీ విడకపోతే ఇతర కోణాలలో దర్యాప్తు చేస్తామన్నారు. హైమావతిది పేద కుటుంబం కాబట్టి ఆమెను దొంగలు హత్యచేసే అవకాశాలు తక్కువని పోలీసులు అనుమానిస్తున్నారు.
News November 28, 2024
కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్.!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరో 2 కీలకమైన నిర్మాణాలు జరగనున్నాయి. స్వయంగా CM చంద్రబాబే ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో మొదటి దశ కింద ఇప్పటికే పలు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయని CM చంద్రబాబు చెప్పారు. రెండో దశ కింద వాడరేవు(చీరాల), కొత్తపట్నం(ఒంగోలు) వద్ద ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నామని ప్రకటించారు. ఇదే జరిగితే జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.