News July 13, 2024
విశాఖ: ఏపీఎల్ టైటిల్ పోరుకు వైజాగ్ వారియర్స్

విశాఖ వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ సీజన్-3లో భాగంగా శుక్రవారం క్వాలిఫైయర్-2 లో వైజాగ్ వారియర్స్ రాయలసీమ కింగ్స్ పై విజయం సాధించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. వైజాగ్ వారియర్స్ ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాయలసీమ కింగ్స్ 7 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. శనివారం ఉత్తరాంధ్ర లయన్స్ తో ఫైనల్ కు వైజాగ్ వారియర్స్ తలపడనుంది.
Similar News
News July 4, 2025
విశాఖలో ఏడో తరగతి బాలికపై అత్యాచార యత్నం

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ట్రీ టౌన్ పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.
News July 4, 2025
విశాఖలో 50 అంతస్తుల అపార్ట్మెంట్లు.. డిజైన్లు ఇవే

విశాఖలో మధురవాడ పరిసర ప్రాంతాల్లో 50 అంతస్తుల 3BHK, 4 BHK ఫ్లాట్స్, 4BHK డూప్లెక్స్ ఫ్లాట్స్‌ని V.M.R.D.A నిర్మించనుంది. సర్వే నంబర్ 331/1 లోని 4.07 ఎకరాల విస్తీర్ణంలో అపార్ట్మెంట్ల నిర్మాణానికి డిజైన్లు సిద్ధం చేశారు. 6 టవర్లు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ తదితర అత్యాధునిక వసతులు కల్పించనున్నారు. జాయింట్, PPP పద్ధతిలో ఈ ప్రాజెక్టు చేపడతారు. విశాఖలో ఇప్పటివరకు 50 అంతస్తులు అపార్ట్మెంట్లు లేవు.
News July 4, 2025
V.M.R.D.A. పరిధిలో అభివృద్ధి పనులకు ఆమోదం

విశాఖలో V.M.R.D.A. బోర్డు సమావేశం శుక్రవారం జరిగింది. పలు అంశాలకు బోర్డు ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా కొత్తూరులో 5.68 ఎకరాల్లో పార్కు నిర్మించనున్నారు. వేపగుంట-పినగాడి మధ్య 60 అడుగుల రోడ్డు నిర్మిస్తారు. మధురవాడ, మారికవలస, వేపగుంటలో అపార్ట్మెంట్లు నిర్మించేందుకు అమోదం తెలిపారు. ఛైర్మన్ ప్రణవ గోపాల్, ఎంసీ విశ్వనాథన్, పురపాలక శాఖ కార్యదర్శి సురేశ్ పాల్గొన్నారు.