News July 13, 2024

గద్వాల: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

image

కుటుంబ కలహాల వల్ల మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాలు మేరకు.. పట్టణానికి చెందిన పద్మ (36)కు కొన్ని రోజులుగా భర్తతో గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో గురువారం రాత్రి మరోసారి గొడవ జరిగింది. దీంతో శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఫిర్యాదులతో కేసు నమోదు చేశామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News January 27, 2026

MBNR: పెరిగిన ఉష్ణోగ్రతలు.. తగ్గుతున్న చలి

image

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాజాపూర్‌లో అత్యల్పంగా 14.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మూడు రోజులతో పోలిస్తే ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగాయి. జడ్చర్ల, మిడ్జిల్‌లో 15.1, భూత్పూర్‌లో 16.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రథసప్తమి ముగియడంతో ఇకపై ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

News January 26, 2026

మహబూబ్‌నగర్: పరేడ్ మైదానంలో పతాకావిష్కరణ

image

మహబూబ్‌నగర్ పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. కలెక్టర్ విజయేందిర బోయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ అమలు స్ఫూర్తితో వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

News January 25, 2026

MBNR: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్

image

ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాల కోసం 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ కరపత్రాలను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. గత రెండేళ్లలో ఇక్కడి విద్యార్థులు 94 ఉద్యోగాలు సాధించారని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. డిగ్రీ అర్హత కలిగిన SC, ST, BC అభ్యర్థులు ఈనెల 30లోగా www.tsstudycircle.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.