News July 13, 2024

కంపార్ట్‌మెంట్లన్నీ ఫుల్.. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 63,493 మంది దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.69 కోట్లు సమకూరింది.

Similar News

News April 5, 2026

విశాఖ: క్రికెట్ మ్యాచ్‌లో గొడవ.. యువకుడి హత్య

image

పెద్దగదిలిలో క్రికెట్ ఆడుతుండగా ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం డోల అజిత్ (23) అనే యువకుడు మరి కొంతమంది క్రికెట్ ఆడుతుండగా కిషోర్ (26)అనే వ్యక్తితో గొడవ జరిగింది. ఆగ్రహించిన కిషోర్‌ మ్యాచ్ అయిపోయిన అనంతరం పెద్ద గదిలి జంక్షన్‌లో అందరూ చూస్తుండగా చాకుతో పొడిచి అజిత్‌ను హత్య చేశాడు.

News April 5, 2026

‘ధురంధర్’ తెర వెనుక హీరోలకు థాంక్స్: సారా అర్జున్

image

ధురంధర్ 2 భాగాలు సూపర్ హిట్ కావడంలో కీలక పాత్ర పోషించిన టెక్నీషియన్స్‌కు హీరోయిన్ సారా అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆదిత్య ధర్‌ను తొలిసారి చూసినప్పుడే ప్రత్యేకంగా ఏదో చేస్తారనుకున్నా. ఆయనతోపాటు దర్శకత్వ బృందం ఎంతో కృషి చేసింది. నిర్మాతలు, DOP, క్యాస్టింగ్ డైరెక్టర్.. ఇంకా ఎంతో మంది ఈ మూవీకి వెన్నెముకలా తెర వెనుక చెమటోడ్చారు. మీ అందరికీ థాంక్స్. చరిత్ర సృష్టించాం’ అని ఇన్‌స్టాలో పేర్కొన్నారు.

News April 5, 2026

PHOTO GALLERY: ఉప్పల్‌లో SRH మ్యాచ్

image

IPL: ఉప్పల్ స్టేడియంలో జరిగిన SRH, LSG మ్యాచుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. దాదాపు 39వేల మంది వచ్చినట్లు సమాచారం. టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ సైతం స్టేడియానికి వచ్చి ప్లేయర్లను ఎంకరేజ్ చేశారు. చేతిలో ఆరెంజ్ జెండా పట్టుకొని ఉత్తేజపరిచారు. SRH ఓనర్ కావ్య, లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా, ఇషాన్ కిషన్ ప్రేయసి అదితి హుండియా, బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్, నిర్మాత సురేశ్ బాబు సందడి చేశారు.