News July 13, 2024

జాతీయ రహదారి విస్తరణకు త్వరలో టెండర్లు

image

AP: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన బాధ్యతను ప్రైవేటు సంస్థకు ఇవ్వాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వచ్చే నెల చివరిలోగా టెండర్లు ఆహ్వానించాలని భావిస్తోంది. 181.5 కి.మీ మేర ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించనున్నారు. నిర్మాణ వ్యయం రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా.

Similar News

News January 20, 2025

తప్పు చేస్తే రుద్రాక్ష మాల తెగిపోయేది: సంజయ్

image

తాను ట్రైనీ డాక్టర్‌ను హత్యాచారం చేయలేదని సంజయ్ రాయ్ ఇవాళ కూడా వాదించాడు. తనను ఓ IPS ఈ కేసులో ఇరికించారని శిక్ష ఖరారుపై వాదనల్లో ఆరోపించాడు. ‘నేను ఈ తప్పూ చేయలేదు. నాపై కుట్ర జరిగింది. నేను నేరం చేసి ఉంటే రుద్రాక్షమాల తెగిపోయేది. అలా జరగలేదంటే మీరే అర్థం చేసుకోండి’ అని వాదించాడు. అటు ఉరి శిక్ష కాకుండా మరో శిక్ష ఎందుకు విధించకూడదో చెప్పాలని సంజయ్ తరఫున కోర్టు నియమించిన లాయర్ CBIని ప్రశ్నించారు.

News January 20, 2025

ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఖరారైనట్లు తెలుస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. సందీప్ రెడ్డి తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలకు కూడా ఈయనే మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. కాగా, ‘నా ప్లేస్‌కు తిరిగి వచ్చాను’ అంటూ హర్షవర్ధన్ కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం గమనార్హం.

News January 20, 2025

సిగ్నల్ లేకపోయినా కాల్ మాట్లాడొచ్చు!

image

కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇంటర్-సర్కిల్ రోమింగ్‌ను ప్రారంభించింది. దీనిద్వారా జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సిగ్నలింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 4G నెట్‌వర్క్ అందిస్తుంది. యూజర్ వాడే సిమ్‌లో నెట్‌వర్క్ లేకపోయినా అందుబాటులో ఉన్న ఏ నెట్‌వర్క్‌నైనా ఉపయోగించి కాల్స్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం టెలికం యూజర్లకు ఎంతో ఉపయోగపడనుంది.