News July 13, 2024
ప్రకాశం: వెబ్‌సైట్‌లో మెరిట్ జాబితా

స్కాలర్షిప్ కోసం 2023 డిసెంబర్ 3న జరిగిన పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారి జాబితా ప్రకాశం వెబ్సైట్ లో ఉంచినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. ఎంపికైన విద్యార్థులు వెబ్సైట్ నుంచి వారి మెరిట్ కార్డును డౌన్లోడ్ చేసుకుని వారి పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా తల్లి పేరును సరిచూసుకోవాలన్నారు. వివరాలు సరిగ్గా ఉన్నట్లయితే NMMS అధికారిక పోర్టల్‌లో ఆగస్టు 31 లోగా అప్లోడ్ చేయాలన్నారు.
Similar News
News July 7, 2025
ప్రకాశం జిల్లా తొలి కలెక్టర్ ఎవరో తెలుసా?

1972లో ప్రకాశం జిల్లా ఏర్పాటైంది. తొలి కలెక్టర్‌గా కత్తి చంద్రయ్య వ్యవహరించారు. నాగులుప్పులపాడు(M) పోతవరంలో 1924 జులై 7న ఆయన జన్మించారు. మద్రాసులో లా పూర్తి చేసి మధురై జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్, గుంటూరు కలెక్టర్‌గానూ వ్యవహరించారు. ఆయన కుమారుడు, కుమార్తె రత్నప్రభ, ప్రదీప్ చంద్ర సైతం IASలే. తండ్రి, కుమారుడు ఒకే జిల్లా(గుంటూరు)కు కలెక్టర్‌గా పనిచేయడం మరొక విశేషం.
News July 6, 2025
ప్రకాశం జిల్లా వాసులకు SP హెచ్చరిక

ప్రకాశం జిల్లా SP ఏ.ఆర్ దామోదర్ శనివారం పలు PSలలో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో కనిగిరి PSను సందర్శించి మాట్లాడారు. జిల్లాలో మొహర్రం వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేడుకల్లో ఎక్కడైనా శాంతి భద్రతలకు విగాథం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News July 6, 2025
’10న మెగా పేరెంట్ – టీచర్ మీటింగ్’

ప్రకాశం జిల్లాలో ఈనెల 10వ తేదీన జరిగే మెగా పేరెంట్ – టీచర్ మీటింగ్‌ను విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు.