News July 13, 2024
WNP: అసైన్డ్ భూములకు ఇచ్చేది లేదు: మంత్రి పొంగులేటి
గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను మరోసారి చేయొద్దనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్వహించిన రైతు భరోసా సమావేశంలో మాట్లాడారు. ఫాంహౌస్లు, గుట్టలు, ప్రభుత్వ అసైన్డ్ భూములకు ఈసారి పెట్టుబడి సాయం ఇవ్వొద్దని, పంటలు సాగు చేసుకునే నిజమైన రైతులకే ఇవ్వాలనే ఉద్దేశ్యంతో, అత్యధిక మంది రైతుల అభీష్టం మేరకు ఈ పథకం అమలు చేసేందుకు నిబంధనలు రూపొందిస్తున్నామన్నారు.
Similar News
News January 16, 2025
శ్రీశైలం: స్వామి అమ్మవార్లకు రావణ వాహన సేవలు
శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి శ్రీశైల క్షేత్రంలో గురువారం బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా స్వామి, అమ్మవార్లకు రావణ వాహన సేవలు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు, భక్తులు, స్థానికులు, తదితరులు పెద్ద ఎత్తున స్వామివారి బ్రహ్మోత్సవ సేవలో పాల్గొన్నారు.
News January 16, 2025
UPDATE: కల్వకుర్తిలో రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలు
కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామం వద్ద తిరుపతి హైవేపై బుధవారం సాయంత్రం <<15163728>>ఘోర రోడ్డు<<>> ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల వివరాలు.. కల్వకుర్తి మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన బంగారయ్య (36), మహేశ్ (35) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News January 16, 2025
వనపర్తి: పాముకాటుతో అత్తాకోడళ్ల మృతి
పాముకాటుతో అత్తాకోడళ్లు మృతిచెందారు. ఈ ఘటన వరపర్తి జిల్లా వీపనగండ్లలోని వల్లభాపురంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. ఈనెల 6న అత్త కిష్టమ్మ(75)ను ఎడమ చేతిపై పాము కాటేయడంతో మరణించింది. కాగా, ఈనెల 12న కోడలు ఎల్లమ్మ(52) ఇంటి అరుగుపై పడుకొని ఉంది. ఈక్రమంలో నాగుపాము ఆమె కాలిపై కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.