News July 13, 2024

కర్నూలు: డీఎస్సీ ఉచిత శిక్షణ

image

డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ సాధికారిత అధికారిణి వెంకటలక్ష్మి తెలిపారు. DED, TTC, TETలో అర్హత సాధించిన BC, SC, ST, మైనార్టీ అభ్యర్థులు ఈనెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కర్నూలులోని BC స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలన్నారు. 60 రోజుల పాటు ఇచ్చే శిక్షణ కాలంలో ఉచిత మెటీరియల్, ఉపకార వేతనం సైతం ఇవ్వనున్నట్లు చెప్పారు.

Similar News

News January 19, 2026

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 93 అర్జీలు

image

కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 93 ఫిర్యాదులు అందాయి. డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, పలువురు సీఐలు పాల్గొన్నారు.

News January 19, 2026

కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీగా సుందర్ రాజు నియామకం

image

సమాచార హక్కు చట్టం–2005 కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీగా ఆదోని వాసి కె.సుందర్‌రాజును జిల్లా అధ్యక్షుడు కిశోర్ సోమవారం నియమించారు. సుందర్‌రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం పొందే హక్కు ప్రతి భారత పౌరుడికి ఉందన్నారు. అవినీతిని నిర్మూలించి పారదర్శకత, జవాబుదారితనాన్ని పెంచడంలో ఆర్టీఐ చట్టం ఎంతో ఉపయుక్తమన్నారు. చట్ట సభ్యులపై దాడులకు పాల్పడితే సెక్షన్ 6(j) ప్రకారం కేసులు నమోదవుతాయన్నారు.

News January 19, 2026

వాట్సాప్‌లోనే FIR కాపీ.. స్టేషన్లకు వెళ్లక్కర్లేదు!

image

మద్దికేర పోలీస్ స్టేషన్ పరిధిలోని FIR వివరాలు ఇకపై వాట్సాప్ ద్వారా సులభంగా పొందవచ్చని SI హరిత ఆదివారం తెలిపారు. 9552300009 నంబర్‌కు మెసేజ్ పంపి, మెనూలో పోలీస్ విభాగాన్ని ఎంచుకుని కేస్ నంబర్ ఎంటర్ చేస్తే ఉచితంగా కాపీ లభిస్తుందన్నారు. దీనివల్ల ప్రజలు స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఈ నూతన విధానంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.