News July 13, 2024
షమీ భవిష్యత్తుపై గంభీర్ మాట్లాడాలి: మాజీ కోచ్

ఫాస్ట్ బౌలర్ షమీ భవిష్యత్తుపై భారత్ హెడ్ కోచ్ గంభీర్ ఓ అంచనాకు రావాలని టీమ్ ఇండియా మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే సూచించారు. ‘గంభీర్, అతడి సిబ్బంది షమీతో మాట్లాడాలి. అతడిది చిన్నవయసేం కాదు. తన భవిష్యత్తు ప్రణాళికలేంటి? ఎలా ఉపయోగించుకోవాలి అన్నది చర్చించాలి. గంభీర్ అండ్ కో పనితీరు మీద నాకు నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు. గాయాల కారణంగా షమీ అన్ని ఫార్మాట్లలోనూ ఆడలేకపోతున్న సంగతి తెలిసిందే.
Similar News
News January 11, 2026
కృష్ణా: సంప్రదాయం ముసుగులో జూదం.. కోడి పందాలపై చర్యలేవి?

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సంప్రదాయం ముసుగులో జూదం శిబిరాలు వెలిశాయి. కోడిపందాలు, పేకాట, గుండాట కోసం భారీ స్టేజ్‌లు, ఫ్లడ్ లైట్లతో బరులు సిద్ధమయ్యాయి. సాధారణ రోజుల్లో నిఘా పెట్టే పోలీసులు.. పండుగ మూడు రోజులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఖాకీల ఉదాసీనత వెనుక అంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
News January 11, 2026
రూ.1.5లక్షల వరకు ఫ్రీ చికిత్స! త్వరలో కేంద్రం ప్రకటన

నేషనల్, స్టేట్ హైవేలపై ప్రమాదాల్లో గాయపడిన ఒక్కొక్కరికి రూ.1.5లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స అందించే పథకాన్ని కేంద్రం అమలు చేయనుంది. ఆయుష్మాన్ భారత్ పథకంతో బాధితులకు 7రోజులు ఫ్రీగా ట్రీట్‌మెంట్ చేస్తారు. ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్)లో డబ్బుల్లేని కారణంతో చికిత్స అందక మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనిని పరిష్కరించేందుకు ప్రధాని మోదీ త్వరలో ఈ పథకాన్ని ప్రకటించనున్నారు.
News January 11, 2026
నేటి ముఖ్యాంశాలు

✥ AP: నీటి విషయంలో రాజీపడేది లేదు: CBN
✥ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు: పవన్
✥ అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం: సజ్జల
✥ TG: నేను వైద్యుడిని కాదు.. సోషల్ డాక్టర్‌ని: రేవంత్
✥ సినీ ఇండస్ట్రీ గురించి నేను పట్టించుకోవట్లేదు: కోమటిరెడ్డి
✥ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ: జనసేన
✥ ‘అల్మాంట్-కిడ్’ సిరప్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
✥ సంక్రాంతి సెలవులు.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ


