News July 13, 2024
అనకాపల్లి: కోడిపెట్ట తల కొరికిన డాన్సర్.. కేసు

అనకాపల్లిలో ఓ డ్యాన్సర్ నృత్య ప్రదర్శన చేస్తూ కోడిపెట్ట తలను కొరికివేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పెటా సంస్థ (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నృత్య ప్రదర్శనలో జనసందోహం ముందు ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కోడి తలను తన పళ్లతో కొరికి చంపాడని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ సంస్థ ఫిర్యాదు చేసింది.
Similar News
News January 11, 2026
విశాఖ పోలీసులను అభినందించిన జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా

విశాఖలో మహిళపై దాడి కేసులో స్పష్టమైన ఆధారాలు లేకున్నా పోలీసులు కేసు ఛేదించారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసులు స్పందించిన తీరు, వేగవంతమైన దర్యాప్తు అభినందనీయమని ఆయన కొనియాడారు. కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయనేందుకు ఇదే నిదర్శనమన్నారు. మహిళల రక్షణలో దేశంలోనే విశాఖకు మొదటి స్థానం కూటమి ఘనతే అన్నారు.
News January 11, 2026
విశాఖ జూ పార్క్‌లో ముగిసిన వింటర్ క్యాంప్

విశాఖ జూ పార్క్‌లో 4 రోజుల నుంచి జరుగుతున్న వింటర్ క్యాంప్ ఆదివారంతో ముగిసింది. జనవరి 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ క్యాంప్ నిర్వహించిన్నట్లు క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. వింటర్ క్యాంప్‌తో వన్యప్రాణుల ప్రపంచాన్ని పిల్లలకు పరిచయం చేశారు. ముఖ్యంగా జూ పార్కులో వెటర్నరీ హాస్పిటల్, జంతువుల నివాసాలు, వాటి ఆహారపు అలవాట్లు, వాటి ప్రత్యేక లక్షణాలపై అవగాహన కల్పించారు.
News January 11, 2026
సైబర్ క్రైమ్ ముఠా ఉచ్చు నుంచి బయటపడ్డ ఉత్తరాంధ్ర యువకులు

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన 27 మంది యువకులు మయన్మార్‌లో సైబర్ క్రైమ్ ముఠాకు చిక్కుకొని నరకయాతన పడ్డారు. యువకులు ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడి తిరిగి మన దేశానికి తీసుకొచ్చారు. ఆదివారం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యువకులు మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


