News July 13, 2024

ఉపఎన్నికల్లో ఇండియా కూటమి హవా

image

దేశ వ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి సత్తా చాటుతోంది. 10చోట్ల కూటమి ముందంజలో ఉంది. పంజాబ్‌లోని జలంధర్‌లో 37,325 ఓట్ల తేడాతో AAP అభ్యర్థి గెలిచారు. బెంగాల్‌లోని 4స్థానాల్లో TMC ముందంజలో ఉంది. తమిళనాడులో DMK, హిమాచల్-2, MP-1, ఉత్తరాఖండ్-2 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బిహార్‌లోని రూపౌలి‌లో ఇండిపెండెంట్, హిమాచల్‌లోని హమీర్‌పుర్‌లో NDA ముందంజలో ఉంది.

Similar News

News January 20, 2025

సంభల్ అల్లర్లు: పాక్ కుట్రపై డౌట్!

image

సంభల్ అల్లర్లలో పాక్ కుట్రకోణంపై డౌట్ వస్తోంది. తుపాకీతో కాల్పులు జరిపిన ముల్లా అఫ్రోజ్‌కు దావూద్ ఇబ్రహీం గ్యాంగుతో సంబంధాలు బయటపడటమే ఇందుకు కారణం. లగ్జరీ కార్ల చోరీ మాస్టర్ మైండ్ షారిక్ షాటా తరఫునే తానీ పనిచేసినట్టు అఫ్రోజ్ అంగీకరించాడు. అతడు కాల్చిన .32 పిస్టల్ బుల్లెట్లు పాక్‌లో తయారైనవే. షారిక్‌కు ISI, D గ్యాంగుతో లింక్ ఉన్నట్టు తెలిసింది. ఇక సంభల్ కేసులో 70 మందిని అరెస్టు చేయడం తెలిసిందే.

News January 20, 2025

₹17 లక్షల పరిహారం ఇవ్వాలన్న జడ్జి.. అవసరం లేదన్న పేరెంట్స్

image

ట్రైనీ వైద్యురాలి హత్యాచార కేసు తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి అనిర్బన్ దాస్ పరిహారంపై సైతం ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి బెంగాల్ ప్రభుత్వం రూ.17 లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. అత్యంత అరుదైన ఈ కేసులో ఉరి శిక్ష విధించాలని CBI లాయర్ వాదించారు. కానీ దీన్ని అత్యంత అరుదైన కేసుగా పరిగణించలేమని జడ్జి తెలిపారు. అటు తమకు పరిహారం అవసరం లేదని అభయ తండ్రి ప్రకటించారు.

News January 20, 2025

నిందితుడికి జీవితఖైదు.. బాధితురాలి పేరెంట్స్ ఆందోళన

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీల్దా కోర్టు దోషి సంజయ్ రాయ్‌కి జీవితఖైదు విధించడంపై బాధితురాలి పేరెంట్స్ ఆందోళనకు దిగారు. అతడికి ఉరిశిక్ష విధించాలని కోర్టు హాల్‌లో డిమాండ్ చేశారు. అప్పుడే తమ కూతురికి న్యాయం జరిగినట్లని వారు పేర్కొన్నారు. అటు ఈ దారుణం వెనుక మరింత మంది ఉన్నారని, సీబీఐ సరిగ్గా దర్యాప్తు చేయలేదని వారు వాదిస్తూ వస్తున్నారు.