News July 13, 2024
రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అంత ప్రమాదమా?
వీటితో కృత్రిమ విపత్తులు సృష్టించవచ్చు. ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్స్‌తో మంచు పర్వతాలను కరిగిస్తే ఫలితంగా కొండ చరియలు విరిగిపడి నదులు ఉప్పొంగి మానవులకు ప్రమాదం ఏర్పడుతుంది. అటామిక్ ఎనర్జీ చట్టం 1962 ప్రకారం అనుమతి లేకుండా ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ వాడటం చట్టవిరుద్ధం. తాజాగా డెహ్రాడూన్‌లో యాక్టివ్ మెటీరియల్స్ పట్టుబడటం దేశంలో అల్లర్లు సృష్టించాలనే కుట్రలో భాగమేననే అనుమానం వ్యక్తమవుతోంది.
Similar News
News January 21, 2025
IT దాడులపై స్పందించిన దిల్ రాజు భార్య
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేస్తోంది. దీనిపై ఆయన భార్య తేజస్విని స్పందించారు. ‘సినిమా నిర్మాణాలకు సంబంధించే మా ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇంట్లో ఉన్న పలు రికార్డులు పరిశీలించారు. ఐటీ అధికారులకు బ్యాంకు వివరాలు ఇచ్చాం. బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేసి చూపించాం. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆమె పేర్కొన్నారు.
News January 21, 2025
డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించొద్దు: జనసేన
AP: మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి అంశంపై ఎవరూ స్పందించవద్దని జనసైనికులకు జనసేన పార్టీ ఆదేశించింది. మీడియా ముందు కానీ, సోషల్ మీడియాలో కానీ దీనిపై ఎవరూ మాట్లాడవద్దని సూచించింది. కాగా ఇదే అంశంపై నిన్న టీడీపీ అధిష్ఠానం కూడా తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది.
News January 21, 2025
ముగిసిన KRMB సమావేశం
TG: హైదరాబాద్ జలసౌధలో జరిగిన KRMB (కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు) సమావేశం ముగిసింది. ఇందులో ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటా, బడ్జెట్ కేటాయింపు, బోర్డు నిర్వహణ, టెలి మెట్రిక్ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించారు. ఈ భేటీలో బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్‌తోపాటు TG నీటిపారుదలశాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్ కుమార్, AP ENC వెంకటేశ్వరరావు, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.