News July 13, 2024

హైదరాబాద్‌లో తగ్గిన క్రైమ్ రేట్

image

నగరంలో శాంతిభద్రతలు గత ఏడాదితో పోలిస్తే తగ్గినట్లు పోలీస్ ‌గణాంకాలు పేర్కొంటున్నాయి. 2023-24కి సంబంధించి తొలి ఆరు (జనవరి నుంచి జూన్) నెలల కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
హత్యలు: 2023‌‌లో 47, 2024లో 45
మర్డర్‌ అటెంప్ట్‌లు: 2023లో 155, 2024లో 145
రోడ్డు ప్రమాదాలు: 2023లో 209, 2024లో 160 యాక్సిడెంట్‌ కేసులు నమోదు అయినట్లు లెక్కలు చెబుతున్నాయి.
SHARE IT

Similar News

News January 9, 2026

FLASH: HYDలో బస్సు బోల్తా

image

సినిమా షూటింగ్‌కు వెళ్తున్న బస్సు పెద్దఅంబర్‌పేట్‌లో బోల్తా కొట్టింది. హయత్‌నగర్ సీఐ నాగరాజు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి మణికొండకు వస్తున్న బస్సు పెద్ద అంబర్‌పేట్ ఫ్లైఓవర్ స్టార్టింగ్‌లో డివైడర్‌ని ఢీకొట్టి బోల్తా కొట్టింది. డ్రైవర్ విజయ భాస్కర్ రెడ్డి, నర్సిరెడ్డి, ఎలక్ట్రిషన్, డ్రైవర్ విజయ్‌లకు గాయాలయ్యాని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 9, 2026

HYD: RTC స్పెషల్ బస్సులు.. 50% స్పెషల్ రేట్లు

image

సిటీ నుంచి సంక్రాంతికి సొంతరు వెళ్లేందుకు నగరవాసి సిద్ధమవుతున్నాడు. అయితే ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతున్న బస్సుల్లో టికెట్లకు స్పెషల్ రేట్లు ఉంటాయి. అంటే అదనంగా 50% వసూలు చేస్తారన్నమాట. పండగ సమయాల్లో అదనపు ఛార్జీ వసూలుకు సంబంధించి గతంలోనే ప్రభుత్వం అనుమతులిస్తూ జీవో 50 జారీ చేసింది. ఈ మేరకే ప్రత్యేక దిన్నాల్లో RTC స్పెషల్ రేట్స్ అమలు చేస్తుంది. అయినా.. అవసరం ప్రజలది.. అవకాశం పాలకులది కదా.

News January 9, 2026

హైదరాబాద్‌ కోసం ‘గోదావరి’ రెడీ

image

నగరవాసులకు నీళ్ల కష్టాలు తీరబోతున్నాయి. హైదరాబాదీల దాహం తీర్చడంతో పాటు మూసీకి పూర్వవైభవం తెచ్చేందుకు జలమండలి రూ. 7,360 కోట్లతో చేపట్టిన గోదావరి ఫేజ్-2, 3 పనులపై ఎండీ అశోక్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మల్లన్నసాగర్ నుంచి వచ్చే 20 టీఎంసీల నీటితో నగరం కళకళలాడనుంది. 2027 డిసెంబర్ కల్లా ప్రాజెక్టు పూర్తి చేసి, 300 ఎంజీడీల నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
SHARE IT