News July 13, 2024
MDK: వాళ్లు BRSలోనే ఉంటారా..? జోరుగా చర్చ..!

రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే 9 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఉమ్మడి మెదక్‌లో KCR, హరీశ్‌రావు సహా మరో ముగ్గురు BRS ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా మరికొందరు MLAలు తమ పార్టీలో చేరుతారని కాంగ్రెస్ శ్రేణులు అంటుండడంతో ఆ ముగ్గురిలో ఎవరైనా చేరుతారా అనే చర్చ జోరుగా జరుగుతోంది. దీనిపై మీ కామెంట్?
Similar News
News November 11, 2025
మెదక్: ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం ఆదర్శనీయమని అదనపు కలెక్టర్ నగేష్ కొనియాడారు. కలెక్టరేట్లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఆజాద్ జయంతి వేడుక నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేష్, అధికారులు, సిబ్బంది ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు నగేష్ తెలిపారు.
News November 11, 2025
మెదక్: సమస్యల సత్వర పరిష్కారానికి… లోక్ అదాలత్: ఎస్పీ

ఈ నెల 15న జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు కోరారు. త్వరగా, తక్కువ ఖర్చుతో, ఇరుపక్షాల సమ్మతితో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఈ లోక్ అదాలత్‌లో లభిస్తుందని ఎస్పీ తెలిపారు. క్రిమినల్ కాంపౌండబుల్, సివిల్, ఆస్తి విభజన వంటి రాజీపడే అవకాశమున్న కేసులను పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని ఆయన సూచించారు.
News November 10, 2025
మెదక్: ‘ఆరు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు’

సంచార పశువైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు 2017 సంవత్సరంలో పశు సంచార వైద్యశాలను అందించారు. ఇందులో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్, హెల్పర్లకు గత ఆరు నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం వచ్చిన వెంటనే పశువులకు సేవలందిస్తున్న తమకు వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


