News July 13, 2024
ఈ ఫ్యాన్సీ నంబర్‌కు రూ.6,00,999

TG: వాహనాల నంబర్ ప్లేట్ల వేలంలో నిన్న సికింద్రాబాద్ ఆర్టీఓకు రూ.18.28లక్షల ఆదాయం వచ్చింది. అత్యధికంగా TG 10 9999 నంబర్ రూ.6,00,999 పలికింది. దీని కోసం ఐదుగురి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఆ తర్వాత TG 10A 0001కు రూ.3.60లక్షలు, TG 10A 0009 రూ.2.61లక్షలు పలికాయి. కాగా గతంలో నిర్వహించిన TG సిరీస్‌లో ఫస్ట్ నంబర్ TG 09 0001కి రూ.9.61లక్షలు పలికింది.
Similar News
News October 31, 2025
జెమీమా రోడ్రిగ్స్ గురించి ఈ విషయాలు తెలుసా?

తాజాగా ఆస్ట్రేలియాపై జరిగిన ప్రపంచకప్ సెమీ-ఫైనల్లో అద్భుత బ్యాటింగ్ జెమీమా రోడ్రిగ్స్ అందరి దృష్టినీ ఆకర్షించారు. ముంబైలో 2000లో జన్మించిన జెమీమా చిన్నవయసులోనే బ్యాట్ చేతబట్టింది. మహారాష్ట్ర అండర్-17, అండర్-19 హాకీ జట్లకు కూడా ఆమె ప్రాతినిధ్యం వహించింది. కానీ చివరికి క్రికెట్‌నే ఎంచుకొంది. 2017లో అండర్-19 వన్డే మ్యాచ్‌లో సౌరాష్ట్రపై 202 పరుగులతో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత మహిళగా నిలిచింది.
News October 31, 2025
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్డీఏ మ్యానిఫెస్టో

➤ ప్రస్తుతం రైతులకు ఇస్తున్న రూ.6వేల పెట్టుబడి సాయం (కర్పూరి ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి) ఏటా రూ.9వేలకు పెంపు
➤ యువతకు కోటి ఉద్యోగాల కల్పన
➤ ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన: కోటి మంది మహిళలను లక్షాధికారులు చేయడం
➤ ఈబీసీల అభివృద్ధి కోసం కులవృత్తుల వారికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం
➤ రాష్ట్రంలో జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, మెట్రో విస్తరణ
➤ బిహార్ నుంచి విదేశాలకు డైరెక్ట్ విమాన సర్వీసులు 
News October 31, 2025
పటేల్ దూరదృష్టిని కాంగ్రెస్ మరచింది: మోదీ

కాంగ్రెస్ బలహీన విధానాల వల్ల కశ్మీర్ ఆక్రమణకు గురైందని PM మోదీ అన్నారు. గుజరాత్ ఏక్తా దివస్‌లో మాట్లాడారు. ‘పాక్ ఆక్రమణ వల్ల కశ్మీర్, దేశంలో అశాంతి నెలకొంది. కశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలని పటేల్ ఆకాంక్షించారు. ఆయన ఆకాంక్షలను నెహ్రూ గౌరవించకుండా కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, జెండాను ఇచ్చారు. పటేల్ దూరదృష్టిని కాంగ్రెస్ మరచింది. వందేమాతరం గేయాన్ని బ్యాన్ చేయాలని చూసింది’ అని ఆరోపించారు.


