News July 13, 2024

ఆ యూట్యూబ్ ఛానళ్లు బ్యాన్

image

సినిమా నటులపై అసభ్యకర వార్తలు పోస్ట్ చేస్తున్న 5 యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేయించినట్లు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఇలాంటి ఛానళ్లపై చర్యలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. కాగా ఇటీవల పలు యూట్యూబ్ ఛానళ్లకు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో అసభ్యకర వీడియోలు పోస్ట్ చేస్తున్న వారు 48 గంటల్లో వాటిని తొలగించాలని హెచ్చరించారు.

Similar News

News April 9, 2026

లెబనాన్‌తో చర్చలకు రెడీ: నెతన్యాహు

image

లెబనాన్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు యూటర్న్ తీసుకోనుంది. ఆ దేశంతో వీలైనంత త్వరగా చర్చలు ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. లెబనాన్ వరుస విజ్ఞప్తుల నేపథ్యంలో చర్చలు ప్రారంభించాలని క్యాబినెట్‌ను ఆదేశించినట్లు తెలిపారు. హెజ్బొల్లా ఆయుధాలను సరెండర్ చేయడమే చర్చల్లో ప్రధాన అంశమన్నారు. ఇది వర్కౌట్ అయితే ఇరాన్-అమెరికా చర్చలపై గందరగోళం కూడా తొలగిపోయే అవకాశం ఉంది.

News April 9, 2026

పంచ్ అదిరింది.. భారత్‌కు పతకాల పంట!

image

ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మహిళల జట్టు సత్తా చాటింది. మంగోలియాలో జరిగిన ఫైనల్స్‌లో మీనాక్షి హుడా (48kg కేటగిరీ), ప్రీతి పవార్ (54kg), ప్రియ (60kg), అరుంధతి చౌదరీ (70kg) స్వర్ణం సాధించారు. ఇప్పటివరకు ఉమెన్స్ టీమ్ మొత్తం 10 పతకాలు (గోల్డ్-4, సిల్వర్-2, బ్రాంజ్-4) సాధించింది. ఇక శుక్రవారం మెన్స్ కేటగిరీలో విశ్వనాథ్ సురేశ్ (56kg), సచిన్ సివాల్ (60kg) ఫైనల్స్‌లో పాల్గొంటారు.

News April 9, 2026

5th క్లాస్ ఎగ్జామ్‌లో దిమ్మతిరిగే ప్రశ్న!

image

AP: పోటీ పరీక్షల ప్రశ్నల తరహా క్వశ్చన్ 5వ తరగతి స్టూడెంట్స్‌ను విస్మయానికి గురి చేసింది. ఇవాళ వాళ్లు రాసిన SA2 ఎన్విరాన్మెంట్ సైన్స్ పరీక్షలో వచ్చిన కఠినమైన ప్రశ్న(2వ స్లైడ్) చూసి విద్యార్థుల దిమ్మతిరిగింది. క్వశ్చన్ చూసి టీచర్లూ అవాక్కయ్యారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలకు ప్రభుత్వ మద్దతు అవసరం అనే స్టేట్మెంట్‌కు ఆన్సర్ గుర్తించడం ఆ స్టాండర్డ్ విద్యార్థులకు కష్టంగా మారింది. దీనిపై మీ COMMENT.